Nee Daare Nee Katha Movie review: ‘నీ దారే నీ కథ’ మూవీ రివ్యూ..ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా..

Nee Daare Nee Katha Movie review: అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘ నీ దారే నీ కథ’. తండ్రీ కొడుకుల ఎమోషనల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిందా లేదా అనేది చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 13, 2024, 03:08 PM IST
Nee Daare Nee Katha Movie review: ‘నీ దారే నీ కథ’ మూవీ రివ్యూ..ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా..

రివ్యూ: ‘ దారే నీ కథ’ (Nee Daare Nee Katha)
నటీనటులు : రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.
బ్యానర్ : జె వి ప్రొడక్షన్స్
నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ
రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ
సంగీతం: ఆల్బర్ట్టో గురియోలి
సినిమాటోగ్రాఫర్: ఎలెక్స్ కావు  
దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ

ప్రియతమ్ మంతిని, సురేష్, అంజన బాలాజీ, విజయ్ విక్రాంత్, వేద్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన సినిమా ‘నీ దారే నీ కథ’. అజయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు.  వంశీ జొన్నలగట్ట దర్శకత్వంలో తేజేష్ వీర నిర్మాతగా వచ్చిన సినిమా ‘నీ దారే నీ కథ’. ఆల్బర్ట్టో గురియోలి మ్యూజిక్ అందించగా ఎలెక్స్ కావు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

కథ విషయానికొస్తే..
అర్జున్ (ప్రియతమ్ మంతిని) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటారు. ఒక మంచి మ్యూజిషియన్ గా మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీం ఫామ్ చేయాలనేది అతని కోరిక. తనకు తన తండ్రి (సురేష్) సపోర్ట్ ఉంటుంది. ఈ సందర్బంలో తన టీమ్ నుంచి బయటకు వెళ్లిపోతాడు.  తనకు సపోర్టుగా శృతి (అంజన బాలాజీ) వస్తుంది. అర్జున్ తండ్రి అర్జునుని అనుకున్న సాధించి ఒక మంచి సంగీతకారుడిగా  చూడాలనుకుంటారు. కానీ ఆయన మధ్యలో మరణిస్తాడు. తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని చాలా బాగా చూపించారు. తన తండ్రి కోరికని అర్జున్ నెరవేర్చాడా లేదా? తను అనుకున్నది సాధించి మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేసి మ్యూజిషియన్ అయ్యాడా లేదా? అనేదే మిగిలిన స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

టెక్నికల్ టీం : వంశి జొన్నలగడ్డ ఎంచుకున్న కథ బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఓ ఎమోషనల్ సినిమా చూసి చాలా కాలమే అవుతోంది. సాంకేతిక పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టీం వర్క్ తో పని చేశారు. ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్  బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఉపయోగిస్తూ  ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాగా ప్రాణంగా నిలిచింది. సింగ్ సౌండ్ అయినా కూడా ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారనే చెప్పాలి.

నటీనటుల విషయానికొస్తే..

ఈ సినిమాకి పెద్ద ప్లస్ గా సీనియర్ నటుడు సురేష్ నిలిచారు. సపోర్టింగ్ తండ్రి క్యారెక్టర్ లో జీవించేసాడు. ఈ సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచేలా సురేష్ పాత్ర ఉంది. ప్రియతమ్ కొత్తవాడైన చాలా బాగా నటించాడు. విజయ్ విక్రాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నవ్విస్తూ ఎమోషన్ పండిస్తూ మంచి నటనని కనబరిచాడు. అజయ్, పోసాని కృష్ణమురళి  తమ పరిధి మేరకు నటించి సినిమాకి సపోర్ట్ గా నిలిచారు. అంజనా బాలాజీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ బాగా నటించింది.

ప్లస్ పాయింట్స్ :
 

సెకండ్ ఆఫ్

ఎమోషన్స్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ ఆఫ్ లో అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్

ఎడిటింగ్

క్లైమాక్స్

రేటింగ్ : 2.75/5

చివరి మాట : ఎమోషనల్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News