Constable: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేసిన హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్..

Constable Title Song: వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం ‘కానిస్టేబుల్’.  జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై  బలగం జగదీష్ నిర్మిస్తారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 26, 2025, 12:20 PM IST
Constable: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేసిన హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్..

Constable Title Song: వరుణ్ సందేశ్ టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘కానిస్టేబుల్’. తాజాగా ఈ సినిమాలో  "కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్  సాంగ్ ను హైదరాబాద్  పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ విడుదల చేశారు. ఈ పాటకు   శ్రీనివాస్ తేజ రాయగా..  సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. నల్గొండ గద్దర్ నర్సన్నఈ  పాటను పాడారు.
 
ఈ సందర్భంగా  పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ.. నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ బాగుందన్నారు. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీవీ ఆనంద్ అన్నారు. ప్రతి పోలీస్ కుటుంబం ఈ పాట వింటుందన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారి హైదరాబాద్ కొత్వాల్ సి వి ఆనంద్ ఈ సాంగ్ రిలీజ్ చేయడం  మా మూవీకి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ కి  ధన్యవాదాలు తెలియజేసారు. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించానన్నారు.

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, ‘కానిస్టేబుల్’ కావడం నా చిన్ననాటి కల.  అది నెరవేరకపోవడంతో ఆ  టైటిల్ తో ఈ  చిత్రాన్ని నిర్మించడంతో నా కల ఈ రకంగా నెరవేరిందన్నారు. కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించాను.   నల్గొండ గద్దర్ నరసన్న తో పాడించాను. ఈ పాటను హైదరాబాద్ పోలీస్  కమిషనర్ సివి ఆనంద్ విడుదల  చేయడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.  దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ.. మంచి కథ, కథనాలతో  వరుణ్ సందేశ్  ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.  సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందరినీ అలరిస్తుందన్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో  దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య నటించారు.
ఈ చిత్రానికి కెమెరామెన్ హజరత్ షేక్ (వలి) పనిచేశారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. శ్రీ వర ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు. B. G. M : గ్యాని, వి. నాని పండు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. శ్రీనివాస్ తేజ మాటలు అందించారు. రామారావు పాటలు అందించడం విశేషం.  
బి నికిత జగదీష్, కుపెందర్ పవార్. సహ నిర్మాతలుగా వ్యవహరించారు. బలగం జగదీష్ ఈ సినిమాకు నిర్మించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ SK.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News