4 Indian Temples for Moksha: మనిషి జీవితంలో పుట్టుక, చావుల మధ్యలో మోక్షం పొందాలని అనుకుంటారు. ప్రపంచంలో ఉన్న హిందువులు ఒక్కసారైనా ఈ ఆలయాలకు వెళ్తి మోక్షమార్గం పొందాలని కోరుకుంటారు.
4 Indian Temples for Moksha: మనిషి జీవితంలో పుట్టుక, చావుల మధ్యలో మోక్షం పొందాలని అనుకుంటారు. ప్రపంచంలో ఉన్న హిందువులు ఒక్కసారైనా ఈ ఆలయాలకు వెళ్తి మోక్షమార్గం పొందాలని కోరుకుంటారు. మనిషి జీవితంలో మోక్షం ప్రాప్తిస్తుందట. ఇలా చేయడం వల్ల మళ్లీ మనిషి జన్మ ఉండదని, చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
బద్రీనాథ్ ధామ్.. బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఉంది. ఇది అత్యంత పరమపవిత్రమైన ఆలయం. దేశ నలుమూలల నుంచి ఈ ఆలయానికి పోటెత్తుతారు. మోక్షం పొందాలనుకునేవారు బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా బద్రీనాథ్ ఆలయాన్ని చూడాలనుకుంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే జోషిమథ్ నుంచి ట్రెక్కింగ్ ద్వారా వెళ్తారు. బద్రీనాథ్ ఆలయాన్ని చేరుకుంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
ద్వారక.. ఇది కూడా అత్యంత పరమపవిత్రమైన ఆలయం. ద్వారక కృష్ణుడి పాలించిన నగరంగా నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా ద్వారక వెళ్లాలనుకుంటారు. ఈ ఆలయంలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి మ్యాగ్నెటిక్ శక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హిందూవులు ఎదురుచూస్తుంటారు.
జగన్నాథ్ టెంపుల్.. ఒరిస్సాలో ఉన్న జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయంలో జగన్నాథుడు, బాలరాముడు, సభద్రలు ఉంటారు. ప్రతి ఏడాది ఇక్కడ అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు. మిలియన్ల మంది భక్తులు వస్తారు. ఆ ఆలయ అర్కిటెక్చర్ కూడా బాగుంటుంది. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథ ఆలయానికి వెళ్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు.
రామేశ్వరం.. ఈ ఆలయ కట్టడం కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. రామేశ్వరం తమిళనాడులో ఉంది. ఇందులో శివుడు కొలువై ఉంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒక్కటి. తాము చేసిన పాపాల నుంచి విముక్తి కల్పించాలని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి పోటెత్తుతారు. ఇది హిందూ మహాసముద్రానికి అతి దగ్గర్లో ఉంటుంది.
ఇక్కడ ఆలయ పరిసరాలు కూడా ఎంతో మనశ్శాంతిని కలిగిస్తాయి. జీవితంలో ఒక్కసారైన ఈ ఆలయానికి వెళ్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)