Drinks Healthier Than Coffee: సాధారణంగా ఉదయం లేవగానే కాఫీ తాగుతాం. ఎందుకంటే కాఫీ అంటే చాలా మందికి ఇష్టమైన పానియం. ఇది తక్షణ శక్తి ఇస్తుంది. మంచి మూడ్‌కు తోడ్పడుతుంది. అయితే, అతిగా కాఫీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
Drinks Healthier Than Coffee: కాఫీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే ఉదయం కాఫీకి బదులుగా ఇతర పానియాలు ఆరోగ్యకరమైనవి ఉన్నాయి. వీటితో ఉదయమే మీకు మంచి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. అవేంటో తెలుసుకుందాం.
గ్రీన్ టీ.. ఇది మన శరీరానికి మంచి డిటాక్స్ డ్రింక్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మనకు ఎంతో ఆరోగ్యకరం. ప్రతి రోజూ ఉదయం గ్రీన్ టీ తీసుకోవడం వల్ల డిటాక్సిఫై అయిపోతుంది. గ్రీన్ టీలో ప్లాంట్ కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి ఆరోగ్యకరమైన డ్రింక్ కూడా. మీ శరీర ఆరోగ్యానికి కావాల్సిన ఖనిజాలు కూడా కూడా పొందుతారు. ఉదయం లేచిన వెంటనే గ్రీన్ టీని పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
కొబ్బరినీరు.. కొబ్బరి నీటిలో పొటాషియం, సోడియం, మెగ్నిషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. మీ శరీరం కోల్పోయిన ఖనిజాలను అందిస్తుంది. అంతేకాదు కొబ్బరినీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కొబ్బరి నీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఈ నీటితో మీ శరీరానికి రోజంతటికీ కావాల్సిన హైడ్రేషన్‌ను అందిస్తుంది. సమతుల ఆహారంలో కొబ్బరినీరు కూడా ఒక భాగం.
బీట్రూట్ జ్యూస్.. బీట్రూట్లో B9 లేదా ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది కణాల అభివృద్ధికి, పనితీరుకు సహాయపడుతుంది. రక్తనాళాలు పాడవ్వకుండా ఫోలేట్ నివారిస్తుంది. అంతేకాదు హార్ట్ స్ట్రోక్, గుండె సమస్యలను రాకుండా నివారిస్తాయి..సాధారణంగా బీట్రూట్లో నైట్రేట్స్ ఉంటాయి. ఇది శరీరం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
నిమ్మరసం.. నిమ్మరసంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున నిమ్మరసం తీసుకోవాలి. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. బరువు పెరగకుండా నిర్వహిస్తుంది. అంతేకాదు నిమ్మరసం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
దాల్చిన చెక్క, తేనె.. దాల్చిన చెక్క, తేనె తో తయారు చేసిన నీటిని మీ డైట్లో చేర్చుకోండి. ఇది గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అంతేకాదు దాల్చిన చెక్క, తేనె మన శరీర ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. అనారోగ్య సమస్యలు రాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )