7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..!

7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఈసారి 3 శాతమే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI సూచిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. ఇటీవల జూన్ నెలకు సంబంధించి AICPI డేటా విడుదల చేయగా.. డీఏ పెంపు 3 శాతం పెంపు దాదాపు ఖాయమైంది. దీంతో మొత్తం డీఏ 53 శాతం వరకు చేరనుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది..? ఎప్పటి నుంచి అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా..!
 

1 /8

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు జీతాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి డీఏ పెంపు జనవరిలో, రెండో డీఏ పెంపు జూలైలో ఉంటుంది. జనవరి డీఏ 4 శాతం పెంచగా.. జూల్ డీఏ 3 శాతం పెంచే అవకాశం ఉంది.  

2 /8

ఈ నెల లేదా సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తారు.  

3 /8

జనవరి డీఏ 4 శాతం పెంచడంతో డీఏ 50 శాతానికి చేరింది. ఇప్పుడు 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 53 శాతానికి చేరుతుంది.  

4 /8

డీఏ 3 శాతం పెరిగితే.. ఉద్యోగి డియర్‌నెస్ అలవెన్స్ రూ.1,00,170 వరకు పొందవచ్చు. ఈ పెంపు గ్రేడ్ పే, జీతం ఆధారంగా మారుతుంది.  

5 /8

గ్రేడ్ పే రూ.1800 నుంచి రూ.2800 స్థాయి 1 నుంచి 5 వరకు, పే బ్యాండ్ 1 (రూ.5200 నుండి రూ.20200)లో ఒక ఉద్యోగి జీతం రూ.31,500 అయితే.. డీఏ 53 శాతం కలిపితే మొత్తం జీతం రూ.1,00,170 అవుతుంది. ప్రస్తుతం వీరిలో 50 శాతం మంది ఉద్యోగులు 6 నెలల ప్రాతిపదికన రూ.94,500 పొందుతున్నారు.   

6 /8

ఉద్యోగి బేసిక్ పే-రూ.31,500; ప్రస్తుత తగ్గింపు రేటు (50 శాతం)-రూ. 15,750/నెలకు; 6 నెలలు తగ్గింపు రేటు (50 శాతం)-రూ.94,500; కొత్త తగ్గింపు రేటు (53 శాతం)-రూ 16695/నెలకు; 6 నెలలకు తగ్గింపు రేటు (53 శాతం) 16695X6= రూ.1,00,170.  

7 /8

గత నాలుగు పర్యాయాలు కూడా డీఏ 4 శాతం పెరిగింది. అయితే ఈసారి 3 శాతం పెరిగి అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.

8 /8

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.