Jio Plan: జియో యూజర్లకు మరో భారీ షాక్‌.. ఎక్కువశాతం రీఛార్జీ చేసుకునే ఆ 2 ప్లాన్లు తొలగింపు..

Jio Removed Popular plans: జియో యూజర్లకు మరో భారీ షాక్‌ ఇచ్చింది రియయన్స్‌ ఇండస్ట్రీ. ఇటీవలె రీఛార్జీ ప్లాన్స్‌లో భారీగా పెంచేసిన టెలికాం దిగ్గజం తాజాగా మరో రెండు ప్రఖ్యాత రీఛార్జీ ప్లాన్స్‌ కూడా తొలగించేసింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా జియో యూజర్లు లబోదిబోమంటున్నారు.
 

1 /6

ఇటీవలె రీఛార్జీ ప్లాన్స్‌ భారీగానే పెంచేసిన టెలికాం దిగ్గజం. రేపు అంటే జూలై 3 నుంచి ఈ పెరిగిన ఛార్జీలు వర్తించనున్నాయి. అయితే, ఇది రెండూ ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ రెండిటిపై కూడా వర్తించనుంది. అయితే, జియో సర్వీస్‌  భద్రత కోసం స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌ ప్రైవసీ ప్రొటెక్షన్‌, ఏఐ పవర్డ్‌ జియో సర్వీస్‌ కూడా ప్రకటించింది. అయితే, 5జీ డేటా రీఛార్జీ ప్లాన్‌లో రెండు ప్లాన్లను తొలగించింది.   

2 /6

జియో రీఛార్జీ ప్లాన్ల మార్పుల తర్వాత ఇలా ఉన్నాయి.. రీఛార్జీ ప్లాన్స్‌.. రూ. 155, రూ. 209, రూ. 239, రూ. 299, రూ. 349, రూ. 399 నుంచి రూ. 189, రూ. 249, రూ. 299, రూ. 299, రూ. 349, రూ. 399, రూ. 449 కు పెంచేసింది. యాడ్‌ ఆన్‌ డేటా ప్లాన్స్‌ కూడా రూ. 15, 25, 61 నుంచి రూ. 19, 29, 69 కు పెంచేసింది.

3 /6

రిలయన్స్‌ తొలగించిన డేటా ప్లాన్స్‌ ఇవే.. రిలయన్స్‌ రెండు పాప్యులర్‌ రీఛార్జీ ప్లాన్లను కూడా తొలగించింది. రేపటి నుంచి వినియోగదారులకు ఈ పెరిగిన ట్యారిఫ్‌లతోపాటు ప్లాన్స్‌ కూడా మరో అదనపు భారంగా మారింది. జియో రూ. 395, రూ. 1559 ప్రీ పెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తొలగించేసింది. దీనిపై ఎక్స్‌ వేదికగా జియో యూజర్లు లబోదిబోమంటున్నారు.

4 /6

రూ. 395 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుటే 84 రోజులపాటు 5జీ అపరిమిత డేటా లభించేది. దీంతో ఎక్కువ శాతం యూజర్లు ఈ ప్లాన్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు.  

5 /6

రూ. 1559 ప్లాన్‌తో 336 రోజులపాటు 5జీ అపరిమిత డేటా సదుపాయం ఉండేది. ఈ ప్లాన్‌ కూడా చాలామంది యూజర్లను ఆకట్టుకునేది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమలు కావడంతో చాలామంది వినియోగదారులు ముందుగానే రీఛార్జీ కూడా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు ప్లాన్లు కనిపించడం లేదు జియో తొలగించేసిందని ఎక్స్‌ వేదికగా తమ బాధను చెప్పుకుంటున్నారు.  

6 /6

జూలై 3 ముందుగా రీఛార్జీ చేసుకునే యూజర్లకు రూ. 155 రీఛార్జ్‌ ప్లాన్‌తో 2 జీబీ డేటా 28 రోజులపాటు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ రీఛార్జీ ప్లాన్‌ మాత్రమే ఎక్కువ మంది రీఛార్జీ చేసుకుంటున్నారు.