Aadhar Card Update: ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయండి.. అది కూడా 5 నిమిషాల్లో ఇంట్లో కూర్చొని..!

Aadhar Card Mobile Number Update: ఆధార్‌ కార్డు మనదేశంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇది భారతీయులకు గుర్తింపు కార్డు. అత్యంత అవసరమైన డాక్యుమెంట్‌ ఆధార్‌. అయితే, ఇంట్లోనే ఆధార్‌ కార్డులో మొబైల్‌ నంబర్ లింక్‌ చేయవచ్చు.
 

1 /5

ఏ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలో ఎలాంటి పనులు అవ్వాలంటే కూడా ఆధార్‌ కార్డు తప్పనిసరి.  అందుకే మీ ఆధార్‌ కార్డు ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేసుకుని ఉండాలి. లేకపోతే ఏవైనా మీ ముఖ్యమైన పనులు అత్యవసర పరిస్థితుల్లో నిలిచిపోవచ్చు.  

2 /5

మీ ఆధార్‌ కార్డుకు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ అయి ఉందో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.  

3 /5

ఆ తర్వాత ఆధార్ వెరిఫై చేసుకోవాలి. ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. క్యాప్చా కోడ్‌ కూడా నమోదు చేయాలి. అక్కడ మీ ఆధార్‌ కార్డుకు లింక్‌ అయిన లాస్ట్‌ 3 డిజిట్స్‌ కనిపిస్తుంది. ఒకవేళ ఏ నంబర్‌ కూడా లింక్‌ ఉండకపోతే ఏ నంబర్‌ అక్కడ కనిపించదు.  

4 /5

ఇప్పుడు మీరు మీ మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయాలనుకుంటే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత  సర్వీసెస్‌లోకి వెళ్లి మొబైల్‌ నంబర్‌ అప్డేట్ చేసుకోవాలి.  

5 /5

ఏ నంబర్‌ ఇప్పటి వరకు మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ అయి ఉండకపోతే మీ దగ్గరలోని ఆధార్‌ సేవా కేంద్రాలకు వెళ్లి వెంటనే లింక్‌ చేసుకోండి. అక్కడ మీరు బయోమెట్రిక్‌ ఇవ్వాల్సి ఉంటుంది.