మీరా జాస్మిన్ను చూస్తే అచ్చ తెలుగమ్మాయిని చూసినట్లే ఉంటుంది. అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసినప్పటికీ.. కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచింది. తాజాగా మీరా జాస్మిన్ ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Meera Jasmine : మీరా జాస్మిన్ను చూస్తే అచ్చ తెలుగమ్మాయిని చూసినట్లే ఉంటుంది. అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత చాలానే సినిమాలు చేసినప్పటికీ.. కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచింది. తాజాగా మీరా జాస్మిన్ ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
2001లో వచ్చిన మలయాళ సినిమా సూత్రధారన్తో మీరా జాస్మిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2004లో వచ్చిన మలయాళ సినిమా పదం ఒన్ను ఒరు విలాపం సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.
మలయాళంలోనే కాదు తమిళ, తెలుగు భాషల్లోనూ మీరా జాస్మిన్ నటించింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది.
తెలుగులో పవన్ కల్యాణ్ సరసన గుడుంబా శంకర్, రవితేజ సరసన భద్ర, బాలకృష్ణ సరసన మహారథి చిత్రాల్లో మీరా జాస్మిన్ నటించింది.
చీరకట్టు, హోమ్లీ లుక్‌లో కనిపించే మీరా జాస్మిన్ను చూడగానే అచ్చ తెలుగమ్మాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మీరా ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది.
చాలా కాలం తర్వాత ఇటీవలే 'మకల్' అనే మలయాళీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కొద్ది నెలల క్రితమే ఇన్‌స్టాలో ఖాతా కూడా తెరిచిన మీరా జాస్మిన్.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా ఓ రెస్టారెంట్లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గతంలో హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్.. ఈ ఫోటోల్లో కాస్త హాట్‌గా కనిపిస్తోంది.