Sanjana: ఆ హీరో వల్లే నొప్పిని భరించలేక నరకం చూసా.. ప్రభాస్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

Sanjjanaa Galrani Shocking Comments: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి చెబుతుంటే.. మరి కొంతమంది ఈ విషయంపై వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ బుజ్జి గారు సినిమా హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 

1 /5

 సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది హీరోయిన్స్ ఈ బాధను భరించాము అంటూ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమా నటి సంజనా గర్లాని హాట్ కామెంట్స్ చేసింది.

2 /5

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె పలు విషయాలు వెల్లడించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో సోగ్గాడు, బుజ్జిగాడు, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో నటించిన ఈమె.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయట పెట్టింది.

3 /5

షూటింగ్ సమయంలో తనతో తప్పుగా ప్రవర్తించిన తీరును వెల్లబుచ్చింది. “కన్నడలో ఒక సినిమా ఒప్పుకున్నాను. సీన్ కి ఓకే చెప్పగానే ఆ హీరో వచ్చి.. నా భుజాలను గట్టిగా పట్టుకొని నలిపేశాడు. ఏంటి అంత గట్టిగా నొక్కారని అడిగితే.. మేనేజ్ చేసుకో అంటూ పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఒక అరగంట షూట్ చేయనని చెప్పాను. ఇక నేను నీతో దెబ్బలు తినడానికి హీరోయిన్గా రాలేదు.. నేనేమీ రౌడీని కాదు. నీతో యాక్షన్ సన్నివేశాలు చేయడానికి అంటూ పక్క నుంచి వెళ్ళిపోయాను,” అంటూ సంజన చెప్పుకొచ్చింది.

4 /5

అయితే సదరు హీరో పేరు మాత్రం ఆమె చెప్పలేదు. ప్రస్తుతం సంజన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

5 /5

ఇదిలా ఉండగా కరోనా సమయంలో డాక్టర్  ను వివాహం చేసుకున్న ఈమె ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం సంజన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.