Sithara Thara Black Days Of Her Life: సినీ పరిశ్రమ అంటే ప్రేక్షకుడికి వీనులవిందుగా ఉంటుంది కానీ సినీ పరిశ్రమలో పనిచేసే వారి జీవితాల్లో మాత్రం చాలా చీకటి జీవితం ఉంటుంది. అలానే ఓ సీనియర్ నటి తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న విషయాలను చెప్పి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అందులో చాలా ఉన్నాయి.
నటి సితార తార కన్నడ సినీ పరిశ్రమలో సీనియర్ నటిగా కొనసాగుతున్నారు. విజయవంతమైన సీరియల్స్ చేస్తూ బిజీ ఉన్న ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల ఒక చానల్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు ఘటనలను పంచుకున్నారు.
నాటక రంగంలో రాణించిన సితార తార తన తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయారు. అనాథ ఆశ్రమంలో పెరిగిన సితార ఆశ్రమాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. పారు సీరియల్‌తో నటి సితార తార గుర్తింపు పొందారు. తన జీవితంలో ఎదురైన కన్నీటి గాథలను ఓ ఛానల్‌తో పంచుకున్నారు.
'నాటక రంగం నుంచి నేను నటనా జీవితం ప్రారంభించా. థియేటర్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న చెడు అనుభవాలను ఏ స్త్రీ కూడా ఎదుర్కోకూడదు. నేను పడిన కష్టం మరెవరికీ జరగకూడదు' అని సితార తార ఆవేదన వ్యక్తం చేశారు.
'నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఇల్లు వదిలి వెళ్లు. ఎవరినైనా నమ్మి ఇల్లు వదిలి వెళ్లిపోతే నాలాగే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సానెహళ్లి మఠాన్ని వదిలి వెళ్లి నేను తప్పు చేశా. పని వెతుక్కుంటూ వెళ్లిన నాకు ఇల్లు లేదు' అని సితార తార తెలిపారు.
'నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఇల్లు వదిలి వెళ్లు. ఎవరినైనా నమ్మి ఇల్లు వదిలి వెళ్లిపోతే నాలాగే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సానెహళ్లి మఠాన్ని వదిలి వెళ్లి నేను తప్పు చేశా. పని వెతుక్కుంటూ వెళ్లిన నాకు ఇల్లు లేదు' అని సితార తార తెలిపారు.
'ప్రయాణ సమయంలోనూ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు. వారి వెనుక ఎవరున్నారో గ్రహించిన వెంటనే వారి ప్రవర్తన నిజంగా అసహ్యంగా ఉంది. ఇప్పుడు నా జీవితంలో నాతో చెడుగా ప్రవర్తించిన వ్యక్తుల పేర్లు చెబితే వారి కుటుంబాలు రోడ్డుపైకి వస్తాయి. అందుకే నేను చెప్పను' అని సితార తార వివరించారు.
'నాతో ఉన్న స్నేహితులు నన్ను వేధించారు. ముసుగు వేసుకుని బతుకుతూ నాతో ఉన్నారు. కొన్నిసార్లు వాళ్లు నా బాత్రూమ్‌లోకి వచ్చారు. నేను స్నానం చేస్తుండగా వచ్చారు. ఎక్కడికక్కడ చేతులు పెడుతూ తాకకూడని ప్రదేశాలను తాకుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్లందరూ నాతోనే ఉన్నారు' అని సితార తార సంచలన విషయాలు పంచుకున్నారు.