Sonal Chauhan: కుంభమేళలో తళుక్కున మెరిసిన బాలయ్య భామ.. ఏకంగా మెడలో ఆ మాల వేసుకుని హల్ చల్.. పిక్స్ వైరల్..

Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు వచ్చి టాలీవుడ్ నటి సోనాల్ చౌహన్ పుణ్యస్నానాలు ఆచరించారు. ఆమె పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
 

1 /6

ప్రయాగ్ రాజ్ కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రజలంతా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు ప్రజలంతా కుంభమేళకు క్యూలు కట్టారు. ఇప్పటికే మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానాలు ఆచరించారు.

2 /6

మరో వైపు సినిమా, రాజకీయ రంగాలనుంచి ప్రముఖులు పెద్ద ఎత్తున కుంభమేలకు వచ్చి త్రివేణి సంగమంలో షాహిస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ కూడా కుంభమేళలో తళుక్కున మెరిశారు. 

3 /6

త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి, గంగమ్మ ఒడిలో పాలు పోసి ప్రత్యేకంగా పూజలు చేశారు. అదే విధంగా ఒడ్డున కూర్చుని ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఆమె పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. 

4 /6

సోనాల్ చౌహన్ బాలయ్యతో కలిసి అనేక సినిమాల్లో నటించారు.  రెయిన్ బో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ భామ.. బాలయ్యతో కలసి లెజెండ్, డిక్టెటర్, రూలర్ సినిమాల్లో నటించి అదరగొట్టారు. 

5 /6

అదే విధంగా ఎఫ్ 3 లో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమాలో కూడా ఈ భామ నటించింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి ప్రస్తుతం విపరీతంగా క్రేజ్ ఉందని చెప్పుకొవచ్చు. ఒకవైపు గ్లామర్ షో చేస్తునే మరోవైపు కుంభమేళలో తళుక్కున డేవోషనల్ గా కాస్ట్యూమ్ లో కన్పించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.   

6 /6

కుంభమేళలో సోనాల్.. ఎల్లో కలర్ డ్రెస్ లో కన్పించారు. ఆమె ముఖానికి గంధం పెట్టుకుని త్రివేణి సంగమంలో స్నానం చేసి ప్రత్యేంగా గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అంతే కాకుండా.. అక్కడే కాసేపు కూర్చుని దైవారాధన చేశారు. ప్రస్తుతం సోనాల్ కుంభమేళ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.