Netflix Streaming Free with Airtel: ఇప్పుడు ఓటీటీల హవా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి వద్ద ఓటీటీ సబ్‌స్క్రీప్షన్ ఉంటుంది. అయితే, దీనికి ప్లాన్స్ ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. అయితే, అదనపు ఖర్చు లేకుండా మూడు నెలలు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ ఎలా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు తెలుసా?
ఏమాత్రం అదనపు ఖర్చు లేకుండా నెట్ ఫ్లిక్ సబ్ స్క్రిప్షన్ పొందాలనుకుంటున్నారా? మూడు నెలల పాటు పొందే బంపర్ ఛాన్స్ ఎయిర్‌టెల్ అందిస్తుంది. కొన్ని రీఛార్జ్ ప్యాక్ లపై ఎయిర్‌టెల్ నెట్ ఫ్లిక్స్ సబ్స్ క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
ఎయిర్‌టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ పై ఓటీటీ కూడా ఉచితంగా అందిస్తుంది. ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్స్ పై నెట్ ఫ్లిక్స్ ఉచితంగా పొందుతారు. దీని ధర రూ. 1800 కంటే తక్కువగా ఉంది. దీనికి కేవలం మీ ఎయిర్‌టెల్ రీఛార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితంగా పొందుతారు. అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 1798 రూపాయలు 84 రోజులపాటు వ్యాలిడిటీ అందిస్తుంది. అంటే దాదాపు మూడు నెలల పాటు ఈ ప్లాన్ పొందుతారు. ఈ ప్లాన్ లో ఏ నెట్వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించడంతోపాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం.
అంటే ఈ ప్లాన్ లో 252 జీబీ డేటా 84 రోజుల పాటు పొందుతారు. మీ ఏరియాలో 5జి అందుబాటులో ఉంటే అపరిమిత 5జీ నెట్ స్పీడ్ కూడా పొందుతారు. అయితే ఈ ప్లాన్ లో రీఛార్జ్ చేసుకుంటే కేవలం మొబైల్ వర్షన్ నెట్ఫ్ స్ట్రీమింగ్ అందిస్తోంది. ఇతర డివైజ్‌లకు ఇది షేర్ చేసే అవకాశం ఉండదు.
పెరిగిన టెలికాం ధరల తర్వాత టెలికాం కంపెనీలు తమ కొత్త ప్లాన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలె ట్రయ్ ఆదేశాల మేరకు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీంతో డేటా వాడని వారు అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు.