Nagarjuna: టబుకు అందుకే ఇంకా పెళ్లి కాలేదు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నాగార్జున.. ఏమన్నారంటే..?

Tabu wedding: కింగ్ నాగార్జున ఇటీవల నటి టబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్నేళ్లుగా వీరిమధ్య వస్తున్న పుకార్లకు నాగార్జున మరోసారి చెక్ పెట్టారని నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.
 

1 /6

బాలీవుడ్ నటి టబు తరచుగా ఏదో ఒక అంశంతో వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఈ భామకు సంబంధించి అనేక వివాదాస్పద అంశాలు వార్తలలో నిలిచాయి. నటి టబు యాభై ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకొలేదు.

2 /6

గతంలో నటి టబు.. మగాడి అవసరం పడక వరకే అంటూ.. ఆమె వ్యాఖ్యలు చేశారని కొన్ని కామెంట్లు సోషల్  మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. దీనిపై చాలా ట్రోల్స్  కూడా జరిగాయి. ఈ క్రమంలో ఏకంగా టబు టీమ్ స్వయంగా రంగంలోకి దిగి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

3 /6

ఆ వ్యాఖ్యలు టబు చేయలేదని, మరోసారి ఫెక్ రూమర్స్ వ్యాప్తి చెందేలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా నటి హెచ్చరించారు.  ఈ క్రమంలో టబు మరోసారి వార్తలలో నిలిచారు. ఈసాకి కింగ్ అక్కినేని నాగార్జున టబుతో తనకున్న అనుబంధాన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

4 /6

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో నటి టబుపై నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. టబుకు తనతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చిన తన ఇంట్లోనే ఉంటారన్నారు.

5 /6

తనతో మాత్రమే కాకుండా.. తన ఫ్యామిలీతో సైతం.. టబుకు మంచి బాండీంగ్ ఉందన్నారు. గతంలో సిసింద్రీ, నిన్నేపెళ్లడతా.. మూవీస్ లలో టబు, నాగార్జున కలిసి చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్.. ఉందని అందుకే టబు ఇంకా పెళ్లిచేసుకొలేదని కూడా పుకార్లు చక్కర్లు కొట్టాయి.   

6 /6

మరోవైపు నాగార్జున టబుకు ముందు నుంచి పెళ్లి అంటేనే ఎందుకో ఆ టాపిక్ రాగానే దాటవేసేదని అన్నారు.  మరీ దీని వెనుక ఖచ్చితమైన కారణం తనకు కూడా తెలీదనిఅన్నారు. అయితే..తనకు టబుకు మధ్య ఏదో ఉందని, టబు అందుకే పెళ్లి చేసుకోకుండా.. అలానే ఉండిపోయిందన్న దాంట్లో మాత్రం ఏమాత్రం వాస్తవంలేదని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.  ప్రస్తుతం నాగార్జున కామెంట్స్  వైరల్గా మారాయి.