Prisha Singh: హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న బడ్డీ భామ.. ప్రిషా సింగ్ పిక్స్‌ చూశారా..!

Buddy Movie Heroine Prisha Singh: అల్లు శిరీష్ హీరోగా శామ్ ఆంటోన్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా బడ్డీ. ఈ మూవీతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ఈ భామ మీడియాతో పంచుకుంది. బడ్డీ మూవీలో తాను ఎయిర్ హోస్ట్ రోల్ పోషిస్తున్నానని.. ఇందుకోసం చాలా ఎయిర్ హోస్టెస్‌ను గమనించానని చెప్పుకొచ్చింది.
 

1 /5

తన ఫొటోల‌ను చూసి ఆడిష‌న్‌కు పిలిచి.. సెల‌క్ట్ చేశారని ప్రిషా సింగ్ తెలిపింది. అయితే పాత్ర‌లోని వేరియేష‌న్స్ చూసి తాను చేయ‌గ‌ల‌నా.. అని కూడా ఆలోచించానంది.  

2 /5

టాలీవుడ్‌లో నటించడం తనకు మంచి అనుభవం అని.. ఇంకా డిఫరెంట్ రోల్స్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది ఈ బ్యూటీ.  

3 /5

వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అంటే ఈ భామకు కాస్త ఇష్టం ఎక్కువే. తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఇందుకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది.  

4 /5

వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన పర్యాటకులతో అడ‌వులకు వెళ్లి యానిమల్స్ కెమెరాలతో క్లిక్‌మనిస్తుంటుంది.  

5 /5

మనం కెమెరాలో తీసే ప్రతి ఫొటోకు బలమైన కథ ఉంటుందని.. యాక్టింగ్ పరంగా ఇది తనను మెరుగుపరుచుకునేలా చేసిందంటూ ప్రిషా తెలిపింది.