AP Hot Weather: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ ప్రభావం పెరిగి ఉక్కపోత మరో రెండు రోజులు ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మొన్నటి వరకు చలి చంపేసింది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనాల వల్ల భారీ వర్షాలు, వరదలు అతలాకుతులం చేశాయి. ఈ నేపథ్యంలో ఎండలు కూడా ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎండల తీవ్రత ఫిబ్రవరి ప్రారంభానికి ముందే మొదలయింది. ఇక రానున్న రెండు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వేడి పెరగనుంది.
పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో రెండు డిగ్రీలు ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది వాతావరణ శాఖ.
నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు మరికొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీలు కూడా పెరిగింది. నందిగామ వంటి ప్రాంతాల్లో ఐదు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వరుసగా అత్యధికంగా 37 డిగ్రీలకు పైగా నమోదు అయింది.
ఈనేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఇక ఎండకాలం శివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. కానీ, అంతకు ముందే ఎండ తీవ్రత పెరిగింది.