Apple 2024 iPad Pro: 2024లో హల్చల్ సృష్టించేందుకు ఆపిల్ సిద్ధమైపోయింది. ఆపిల్ ఐప్యాడ్ ప్రో సిరీస్‌లో చాలా మార్పులు కన్పించనున్నాయి. యూజర్లను ఇట్టే ఆకర్షించేందుకు ఆపిల్ కంపెనీ సరికొత్త అప్డేట్స్ చేసినట్టు తెలుస్తోంది.
Apple 2024 iPad Pro: ఆపిల్ ఐ ప్యాడ్ ప్రో 2024లో ఆపిల్ కంపెనీ చేస్తున్న మార్పుల్లో కీలకమైందిగా డిస్ప్లే, శక్తివంతమైన చిప్ అని చెప్పవచ్చు. ఈ రెండు ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే
ఆపిల్ కంపెనీ 2024లో ఎం3 ఆపిల్ సిలికాన్ చిప్సెట్ , ఓఎల్ఈడీ డిస్ప్లేతో పాటు ఐప్యాడ్ ప్రో లైనప్ దింపేందుకు సిద్ధమౌతోంది. ఇందులో కొత్త మోడల్ 12.9 ఇంచెస్ వేరియంట్ స్థానంలో ఉండవచ్చు.
ఆపిల్ 2024లో తన ఐప్యాడ్ ప్రో లైనప్ కోసం ఎం3 ఆపిల్ సిలికాన్ చిప్సెట్, ఓఎల్ఈడీ డిస్ప్లే దింపవచ్చని తెలుస్తోంది. కొత్త మోడల్ 11 ఇంచెస్ , 13 ఇంచెస్‌లో రావచ్చని అంచనా.
కాలిఫోర్నియాలోని టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్..అప్‌కమింగ్ ఐప్యాడ్ ప్రో ద్వారా ట్యాబ్ మార్కెట్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అటు ఐప్యాడ్ ప్రోలో 2018 తరువాత ప్రోసెసింగ్ పవర్, డిస్ప్లే క్వాలిటీ, కెమేరా సామర్ధ్యంలో సాధారణ మార్పు మాత్రమే కన్పించింది.
ఆపిల్ తన అప్‌కమింగ్ ఆపిల్ సిలికాన్ చిప్, ఎం3ను ఐప్యాడ్ ప్రోలో లైనప్ చేయాలని భావిస్తోంది. J717, J718, J720,J721 కోడ్ నేమ్ కలిగి ఐప్యాడ్ ప్రో 2024లో లాంచ్ కానుంది. ఇందులో ప్రధానంగా ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండవచ్చు.
ఐ ప్యాడ్ ప్రోతో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన మ్యాజిక్ కీబోర్డ్‌లో కూడా ఆపిల్ మార్పులు చేసింది. ఇందులో అతిపెద్ద ట్రాక్ ప్యాడ్ ఇంటిగ్రేట్ చేసింది కంపెనీ. ఇప్పుడున్న కాన్ఫిగరేషన్‌తో పోలిస్తే అత్యధిక శక్తివంతమైంది.