NBK Spl Cameo in Rajini Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 70 యేళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక రీసెంట్ టైమ్ లో ‘జైలర్’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు. ఈ సినిమాకు సీక్వెల్ జైలర్ 2 మూవీని అనౌన్స్ చేసారు. ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ క్యామియో రోల్లో చేయడం దాదాపు ఖాయమనే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడుతోంది.
NBK Spl Cameo in Rajini Jailer 2: రజినీకాంత్ సౌత్ నుంచి నార్త్ వెళ్లి అక్కడ వరుస సినిమాలతో అదరగొట్టారు. ప్రస్తుతం 70 ప్లస్ ఏజ్ లో ప్యాన్ ఇండియా రేంజ్ లో అలరిస్తోన్న ఏకైక కథానాయకుడు రజినీకాంత్ అని చెప్పాలి. రెండేళ్ల క్రితం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ సినిమాలో అలరించారు. తాజాగా ఇపుడీ మూవీకి సీక్వెల్ గా ‘జైలర్ 2’ అనౌన్స్ చేశారు. ఈచిత్రంలో బాలకృష్ణ నటించడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది.
అవును ఒకే సినిమాలు రజినీకాంత్, బాలకృష్ణలు కలిసి నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకులున్నారు. రజినీకాంత్ గురించి నార్త్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. బాలయ్య సినిమాలు ఇపుడిపుడే నార్త్ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు. ఇపుడీ వీళ్లిద్దరి కలయికలో ‘జైలర్ 2’ రాబోతుంది.
ఆల్రెడీ ‘జైలర్’ సినిమాలో మలయాళం నుంచి మోహన్ లాల్.. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ (శివన్న)లు అదిరిపోయే పవర్ ఫుల్ క్యామియో పాత్రల్లో అలరించారు. ఆ సినిమాలో తెలుగులో బాలయ్యను తీసుకోవాలనుకున్నాడట దర్శకుడు నెల్సన్. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు.
‘జైలర్ 2’ లో రజినీకాంత్ తో కలిసి బాలకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమనే ముచ్చట కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సర్కిల్స్ ల్లో వినిపిస్తోంది. మరోవైపు హిందీ నుంచి అజయ్ దేవ్ గన్ పవర్ ఫుల్ కేమియో రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా సౌత్ బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి ఒకే స్క్రీన్ పై చూడటం అందులో తెలుగు సీనియర్ టాప్ స్టార్ బాలయ్య ఉంటే ఆ మజాయే వేరే. ఇక ‘జైలర్ 2’లో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ రోల్ ఉందట. ఇప్పటికే రజినీకాంత్ తో పాటు నెల్సన్ ఈ పాత్రను బాలయ్యకు వివరించారట.
బాలకృష్ణ కూడా ఈ క్యారెక్టర్ చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘జైలర్ 2’ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు 27 రోజుల డేట్స్ అడ్జస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ,రజినీకాంత్ కు వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి కాంబోకు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు కలిస్తే ఆ కిక్కే వేరప్ప. ఇక బాలయ్య.. ‘గాండీవం’లో మోహన్ లాల్ కేమియో పాత్రలో ఓ పాటలో కనిపించారు. అటు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో శివన్న ఓ పాటలో కేమియో రోల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.
ఇక రజినీకాంత్ కూడా గతంలో అన్న ఎన్టీఆర్ తో ‘టైగర్’ అనే మల్టీస్టారర్ సినిమా చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు వాళ్ల అబ్బాయి అయిన బాలకృష్ణతో స్క్రీన్ చేసుకోనుండటంతో నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.