Bank Holidays: ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు..!

Continuous 5 days bank Holidays: సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకులకు ముందుగానే సెలవులు వచ్చాయి. ఈరోజు రెండో శనివారం (జనవరి 11వ తేదీ) నేటి నుంచి వరుసగా ఐదు రోజుల బ్యాంకులకు సెలవులు రానున్నాయి.  జనవరి 14 సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇవే
 

1 /5

బ్యాంకులకు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సెలవులు వస్తాయి. ఇవి కాకుండా ప్రతి రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి. ఇవి కాకుండా స్థానిక పండుగల ఇతర ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో కూడా బ్యాంకులకు సెలవులు వస్తాయి.  

2 /5

ఈ నెలలో బ్యాంకులకు మరోసారి వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు రెండో శనివారం కాబట్టి నేటి నుంచి వరుసగా ఐదు రోజులు సెలవులు. రేపు ఆదివారం, ఇక సోమవారం భోగి పండుగ నేపథ్యంలో సెలవులు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. 15వ తేదీ తిరువల్లూరు దినోత్సవం సందర్భంగా తమిళనాడులో సెలవు వస్తుంది.  

3 /5

ఇలా వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వరుసగా 5 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. ఈ కాలంలో యూపీఐ చెల్లింపులు సులభతరం అయింది బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేని పనులు పూర్తి చేసుకోవచ్చు.  

4 /5

అంతే కాదు డబ్బు పొందడానికి, డిపాజిట్ చేయడానికి కూడా ఏటీఎం మెషిన్లు అందుబాటులోనే ఉంటాయి. నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు ఆన్లైన్లోనే పొందవచ్చు. ఇక జనవరి 25 నాలుగో శనివారం 26 ఆదివారం మరోసారి వరుసగా రెండు రోజులు కూడా సెలవులు వస్తాయి.  

5 /5

బ్యాంకులకు ఐదు రోజులు పనిదినాలు చేయాలని వచ్చే నెలలో బ్యాంకులు అన్ని కలిసి రెండు రోజులపాటు స్ట్రైక్ చేయనున్నారు. ఆల్‌ ఇండియా బ్యాంకింగ్‌ ఫెడరేషన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నో రోజులుగా బ్యాంకులకు ఐదు రోజులు పనిదినాలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.