Big Alert: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..

School Holiday In AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు కురుస్తూ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికారులు కూడా కావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రేపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 

1 /5

ఉత్తరాంధ్రలో నిరంతరం కురుస్తున్న వర్షాలు అధికారులు మత్స్యకారులకు కుడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్టణం వ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షాలు రెండు రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీలకు రేపు సోమవారం సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 9 మంది చనిపోవడం బాధకరమని అన్నారు.గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అసాధారణ వర్షపాతం 37 సెం.మీ కురిసిందని సీఎం చెప్పారు.  

2 /5

అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ సూచించారు. అంతేకాదు వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా రేపు సోమవారం 2వ తేదీ కూడా అన్ని స్కూళ్లు, కాలేజీలకు  సెలవు ప్రకటించారు.   

3 /5

రానున్న 24 గంటలకు పైగా వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక విజయవాడలో కూడా కుండపోత వర్షంతో రోడ్లన్ని అస్తవ్యస్తంగా తయారయ్యాయి.  

4 /5

అతి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే విశాఖపట్టణం విద్యాశాఖ అధికారులు రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీలు సెలవు ప్రకటించాయి.  ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించారు.  

5 /5

ఇక ఈ జిల్లాలు మాత్రమే కాదు గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, కృష్ణ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా రేపు సోమవారం అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ , ప్రైవేటు రంగ స్కూళ్లు కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు.