Cement Price: గృహ నిర్మాణదారులకు బంపర్ న్యూస్.. సిమెంట్ ధరలు భారీగా తగ్గింపు..!

Cement Price Drop in India: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని ఓ సామెత అందరికీ తెలిసిందే. అప్పట్లో ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం ఓ ఇల్లు నిర్మించాలంటే సాధారణ ప్రజలు సర్వంధార పోయాల్సిందే. పెరిగిన నిర్మాణ ధరలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సిమెంట్ ధరలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గృహ నిర్మాణదారులకు ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. 
 

1 /5

సిమెంట్ ధరలు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రానున్న కాలంలో సిమెంట్ ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.  

2 /5

మార్కెట్‌లో తీవ్రమైన పోటీ కారణంగా.. సిమెంట్ ధరలు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు.   

3 /5

మళ్లీ డిమాండ్ పెరిగే వరకు ధరలు స్థిరంగా ఉంటాయని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ వినియోగం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

4 /5

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామీణ, పట్టణాల్లో గృహాల నిర్మాణం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల పెరుగుదలతో సిమెంట్‌కు డిమాండ్ ఏర్పడుతుందని అంటున్నారు.  

5 /5

ప్రస్తుతం సిమెంట్ రంగంలో సవాళ్లను ఎదురవుతున్నా.. FY26 నుంచి మార్కెట్ పరిస్థితులు, ధరల ట్రెండ్‌లలో ఆశించినస్థాయిలో పెరుగుదల ఉంటుందని యెస్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది.