Sobhita Dhulipalla: పెళ్లయిన 2 నెలలకే శుభవార్త చెప్పిన శోభిత.. నమ్మలేకపోతున్నా అంటూ వైరల్‌ పోస్ట్‌..!

Sobhita Dulipalla Viral Post: శోభిత నాగచైతన్యల పెళ్లి డిసెంబర్ 4న జరిగింది. వీరి పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు శోభిత శుభవార్త చెప్పింది. నాగచైతన్య పెళ్లి చేసుకున్న శోభిత అక్కినేని వారింటి అడుగుపెట్టింది. రెండు నెలలు కూడా పూర్తికాక ముందే గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకి శుభాకాంక్షలు చెప్తున్నారు. శోభిత పెట్టిన ఆ పోస్ట్‌ నెట్టింటా వైరల్‌ అవుతుంది.
 

1 /5

శోభిత ధూళిపాల సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటారు. ఏ శుభకార్యాలైన, సినిమా గురించి అయినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అయితే ఇటీవల శోభిత షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతో ఆమె ఫ్యాన్స్‌, అక్కినేని ఫ్యాన్స్‌ శోభితకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  

2 /5

'ది మంకీ మాన్' అనే సినిమాలో శోభిత నటించింది. ఇప్పుడు ఆ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్లో చోటు సంపాదించుకుంది. ఇక 'రాటన్ టమాటోస్ టు బెస్ట్ రివ్యూడ్' మూవీ గా  కూడా అగ్రస్థానం సంపాదించడంతో ఇది కలనా? నిజమా? అంటూ శోభిత పోస్ట్ షేర్ చేసింది.  

3 /5

ఇక ఈ సినిమాకు ఇటీవలే బాఫ్తాలో కూడా 'బెస్ట్ యాక్షన్ అండ్ అడ్వెంచర్స్' మూవీస్ క్యాటగిరి లో కూడా చోటు సంపాదించుకుంది. తను నటించిన ఈ సినిమా ఇలా సక్సెస్ అందుకోవటంతో ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేను అంటూ శోభిత ఇన్స్టా పోస్టు పెట్టింది.

4 /5

దీంతో ఫ్యాన్స్ శోభిత దుళిపాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్యతో కలిసి శోభిత నటించలేదు.. కానీ అడవి శేష్‌ హీరోగా నటించిన గూఢచారి, మేజర్ వంటి సినిమాలో నటించింది మంచి పేరు దక్కించుకుంది. ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె తెలుగు అమ్మాయి కూడా.  

5 /5

నాగచైతన్య సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల వాళ్ళు విడిపోయారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో వేదికగా శోభిత నాగచైతన్యాలు కుటుంబ సభ్యుల నడుమ పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య నటించిన 'తండేల్‌' వచ్చేనెల విడుదలకు సిద్ధంగా ఉంది.