Telangana And Andhra Pradesh Union Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అందించింది. వరదలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం భారీగా సహాయ నిధులు విడుదల చేసింది. కేంద్రం సహాయంతో వరద బాధితులకు సత్వర సహాయం అందనుంది.
Union Govt Flood Releif Fund: భారీ వర్షాలు.. వరదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ముంచెత్తాయి.
Union Govt Flood Releif Fund: తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, ఏపీలో విజయవాడ, గుంటూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.
Union Govt Flood Releif Fund: వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.
Union Govt Flood Releif Fund: వరద సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి.
Union Govt Flood Releif Fund: తీవ్రంగా నష్టం ఉండడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వస్తు సామగ్రి అందించింది.
Union Govt Flood Releif Fund: తాజాగా ఏపీతోపాటు తెలంగాణకు కూడా వరద సహాయం ప్రకటించింది. వరద నష్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు.
Union Govt Flood Releif Fund: కేంద్ర మంత్రుల పర్యటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రెండూ రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుదల చేస్తూ ప్రకటించింది.