Kumari Aunty Donates Rs 50k To Telangana CMRF: సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన కుమారి ఆంటీ మరో సంచలనం రేపారు. రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం అందించారు. వరద బాధితుల కోసం ఆమె సహాయం అందించగా.. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిని కలవాలనే ఆమె కోరిక తీరింది.
Telangana And Andhra Pradesh Union Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అందించింది. వరదలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం భారీగా సహాయ నిధులు విడుదల చేసింది. కేంద్రం సహాయంతో వరద బాధితులకు సత్వర సహాయం అందనుంది.
అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం (Hyderabad Rains) అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చాలా మందికి అందించింది.
Rains and floods in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. అందులో 11 మంది హైదరాబాద్ పరిధిలోని వారేనని అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వివరించారు. భారీ వర్షాలు, వరదపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ వరదలు ( Hyderabad Floods ) నగరవాసుల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఎటు చూసినా నడుం లోతు నీళ్లు.. కూలిన ఇళ్లు.. రోడ్డున పడిన బతుకులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో వరదలు కొత్త కాకపోయినా.. ఈసారి వచ్చిన భారీ వరదలు మాత్రం ఎప్పుడూ లేనన్ని ఇబ్బందులను కొనితెచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసన భారీ వర్షానికి ( Heavy rains ) చాలా చోట్ల ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలు వరద నీళ్లలో కొట్టుకుపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.