Gangavva remuneration: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో మరో నెల రోజులు గడిస్తే ఈ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. ఇక పదవ వారంలో భాగంగా గంగవ్వ హరితేజ ఎలిమినేట్ అవ్వడం వైరల్ గా మారింది.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ ఈమధ్య కాలంలో భారీ ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 8 సెప్టెంబర్ ఒకటవ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పది వారాలు పూర్తి చేసుకొని 11వ వారం కూడా మొదలయ్యింది.
8 మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి.. తమ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే పదవ వారం తనకు ఆరోగ్యం సహకరించడం లేదని గంగవ్వ ఎలిమినేట్ అవ్వగా.. పదవ వారం నామినేషన్ లో భాగంగా హరితేజ ఎలిమినేట్ అయింది.
2017లో ప్రసారమైన సీజన్ వన్ కంటెస్టెంట్గా హరితేజ తన అద్భుతమైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది.. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలనుకుని అడుగు పెట్టింది. కానీ ఐదు వారాలకే ఈమె జర్నీ ముగిసింది.
ఐదు వారాలకు గానూ వారానికి రూ .3లక్షల ఒప్పందంతో హౌస్ లోకి రాగా.. మొత్తం రూ.15 లక్షల తీసుకుందని సమాచారం. ఇక అలాగే హరితేజ వారానికి రూ.3.5 లక్షల ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టింది. 5 వారాలు పూర్తయిన సందర్భంగా రూ.17.5 లక్షలు ఆమె సొంతమైనట్లు సమాచారం. ఇకపోతే వీరిద్దరికీ భారీ పాపులారిటీ ఉంది కాబట్టే వారానికి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
11వ వారానికి సంబంధించి యష్మీ, గౌతమ్, పృథ్వి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్ నామినేషన్స్ లోకి వచ్చారు . ఇక వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు ఇకపోతే ఇప్పటివరకు పోలైన ఓట్ల పరంగా చూసుకుంటే గౌతమ్ ప్రథమ స్థానంలో ఉండగా.. అవినాష్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం.