Continuous 9 Days Holidays For Sankranti: సంక్రాంతి పండుగ అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా తమిళ ప్రభుత్వం విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. ఏకంగా 9 రోజుల పాటు సెలవులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
తమిళనాడులో సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తుంటారు. తమిళ ప్రజలు పొంగల్‌ను ఎంతో ఘనంగా చేసుకుంటారు.
పొంగల్‌కు తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు భారీ కానుకలు ఇస్తోంది. ఇప్పటికే ప్రత్యేక బహుమతి ప్యాకేజీ, ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.
విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. 9 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
తమిళనాడులో జనవరి 14వ తేదీన మంగళవారం పొంగల్ పండుగ జరుపుకోనున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు జనవరి 15, 16, 18, 19 తేదీల్లో ప్రభుత్వం పండుగ సెలవులు ఇచ్చింది.
అయితే జనవరి 17వ తేదీన శుక్రవారం సెలవు ప్రకటించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ ఒక్కరోజు కూడా సెలవులు ఇవ్వాలని భావించారు.
ఆ ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
అందరి విజ్ఞప్తి మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈనెల 17వ తేదీన సెలవు ప్రకటించింది. దీనికి ప్రత్యామ్నాయంగా జనవరి 25వ తేదీన శనివారం పనిదినంగా ప్రకటించారు.
జనవరి 13న సెలవులు ప్రారంభమై ఈనెల 19వ తేదీ వరకు ఆదివారంతో కలిపి మొత్తం 9 రోజుల సెలవు లభిస్తోంది.