Business Ideas: తెలివితేటలు ఉంటే ఎలాగైనా బతకవచ్చు. ఉన్న ఊరిలోనే లక్షలు సంపాదించవచ్చు. అందుకు ఎకరం పొలం ఉంటే చాలు. లేదంటే కౌలుకు తీసుకున్నా పర్వాలేదు. ఈ పంటను సాగు చేస్తే తక్కువ సమయంలోనే అంటే మూడు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. ఈ పంట సాగు చేస్తే సీజ్ లో 2 నుంచి 3లక్షల వరకు ఆదాయం పక్కగా వస్తుంది. ఇంతకూ ఆ పంట ఏదో చూద్దామా.
Business Ideas: ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు సంప్రదాయ వ్యవసాయంతోపాటు కూరగాయల సాగుపై ఫోకస్ పెడుతున్నారు. రైతులే కాదు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న యువత కూడా వ్యవసాయంపై ఆకర్షితులవుతున్నారు.
ఉద్యోగాలను వదిలి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తూ లక్షల సంపాదిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనే చేస్తుంటే ఈ బిజినెస్ పై ఓ లుక్కేయ్యండి.
మీకు ఎకరం పొలం ఉంటే మీకు దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు మీరు కాలీఫ్లవర్ సాగు చేయండి. ఎకరం పొలంలో ఈ పంటను సాగు చేయవచ్చు.
మూడు నెలల్లో అంటే 60 నుంచి 80 రోజుల్లో కాలీఫ్లవర్ సాగు సిద్ధమవుతుంది. కాలీఫ్లవర్ సాగు ద్వారా సీజన్ లో 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
సీజన్ లో మార్కెట్లో క్యాలిఫ్లవర్ 50 నుంచి 60 రూపాయలు ఒక్కోసారి 80 నుంచి 90 రూపాయలకు కూడా విక్రయించవచ్చు. అందుకే చాలా మంది రైతులు ఈ కూరగాయలను సాగు చేస్తున్నారు. కూరగాయలు పండించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. అందుకే చాలా మంది నిరంతరం కూరగాయలను సాగు చేస్తున్నారు.
క్యాలిఫ్లవర్ తోపాటు క్యాబేజీని కూడా సాగు చేయవచ్చు. కాలీఫ్లవర్ వంటి కూరగాయలు తక్కువ సమయంలో మంచి లాభాలను అందిస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు సాంప్రదాయపు పంటలను వదిలి కూరగాయల సాగు చేస్తున్నారు. అయితే కాలీఫ్లవర్ ఒక్కటే కాదు సీజన్ కు తగ్గట్లుగా కూరగాయలు పండించినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు.
ఎకరం భూమిలో రకరకాల కూరగాయలను పండించవచ్చు. నీరు కూడా తక్కువగా అవసరం ఉంటుంది. ముఖ్యంగా పుదీనా, కొత్తీమీర వంటివి వాటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఇతర పంటలను వేసినప్పుడు గట్ల పక్కన వీటిని పండిస్తే రెట్టింపు ఆదాయం పొందవచ్చు.