Cherry: ఈ ఎర్రపండుతో నిద్రలేమికి చెక్‌.. చర్మ ఆరోగ్యానికి మేలు..

Cherry Benefits: చెర్రీ పండు డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కాదు.. అందానికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు ఇది ఆక్సిడేటీవ్‌ డ్యామేజ్‌ రాకుండా కాపాడుతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్ రాకుండా నొప్పుల సమస్య నుంచి దూరంగా ఉంచేలా చేస్తుంది. ఎరుపు రంగులో ఉండే ఈ చెర్రీ పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు మరిన్ని తెలుసుకుందాం.
 

1 /5

నిద్రలేమి సమస్యకు చెర్రీ పండ్లు ఎఫెక్టివ్ రెమిడి. వీటిని తినడం వల్ల మెలోటినైన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో నిద్ర సైకిల్ కి ఎలాంటి భంగం వాటిల్లదు.. ఆరోగ్యంగా నిద్రపోతారు.   

2 /5

చెర్రి పండు డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులోనే పొటాషియం, బ్లడ్ ప్రెషర్ ను అదుపులో ఉంచుతుంది.. దీంతో కార్డియో సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  

3 /5

చెర్రీ పండ్లు తీసుకోవడం వల్ల వర్కౌట్ చేసిన తర్వాత వచ్చే కండరాల్లో నొప్పికి ఎఫెక్టీవ్‌ రెమిడీ.  ఇందులో ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తోడ్పడతాయి. వర్కౌట్ చేసేవాళ్ళు చెర్రీ పండ్లను స్నాక్ రూపంలో తీసుకోవాలి. అంతేకాదు జాయింట్ పెయిన్‌తో బాధపడుతున్న వారు కూడా చెర్రీ పండ్లు తీసుకోవాలి. కీళ్ల నొప్పులు యూరిక్ యాసిడ్‌ని కూడా తగ్గిస్తుంది.  

4 /5

ఆరోగ్యానికి మాత్రమే కాదు చెర్రీ పండ్లు అందానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఖనిజాలు కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతాయి. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.  

5 /5

చెర్రీ పండ్ల లోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియన్స్ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ సమస్య రాకుండా వ్యతిరేకంగా పోరాడతాయి. సీజనల్ జబ్బులకు చెక్‌ పెడతాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా చెర్రీ పండు తినాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన స్నాక్.