Rashmika Mandanna: స్టోరీనే ఫైనల్.. ఆ పాత్రలు చేసేందుకూ రెడీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక మందన్న.. మ్యాటర్ ఏంటంటే..?


Chhaava Beauty rashmika mandanna: రష్మిక మందన్న ఇటీవల చావా మూవీ రిలీజ్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.

1 /6

రష్మిక మందన్న, విక్కికౌశాల్ జంటగా నటించిన హిస్టారికల్ మూవీ ఛావా ఈరోజు విడుదలైంది.ఈ మూవీకి ప్రస్తుతం ఫ్యాన్స్ నుంచి మంది  ఆదరణ లభించింది. ఈ మూవీలో రష్మిక బాగా నటించిందని, విక్కికౌశాల్ సినిమాకు కూడా అద్భుతంగా నటించాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు  

2 /6

మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ మహారాజ్ శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కోసం రష్మిక ఎంతో కష్టపడ్డారని కూడా మూవీ టిమ్ వెల్లడించింది.ఈ మూవీ మంచి  టాక్ రావడంతో తాజాగా.. నటి రష్మిక  ఇంటర్వ్యూలో మాట్లాడారు.  

3 /6

ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ.. తనకు శంభాజీ మహారాజ్ సతీమణిగా నటించే అవకాశం రావడం తన లక్ అని అన్నారు. ఈ మహారాణి పాత్ర కోసం తాను.. వంద శాతం కష్టపడ్డానని అన్నారు.ఈ సినిమాలో రష్మికను ఎంపిక చేసేటప్పుడు కొంత మంది మరాఠాలో ఎవరు దొరకలేదా..అని ట్రోల్స్ సైతం చేశారు.  

4 /6

అవన్నింటికి అధిగమించి రష్మిక ఈ మూవీలో సూపర్ గా నటించారు. అంతేకాకుండా.. తన కాలు ఫ్యాక్చర్ అయిన కూడా ఆమె ఛావా మూవీ ప్రమోషన్ లలో పాల్గొన్నారు. అయితే.. రష్మిక తాజాగా.. తనకు స్టోరీ నచ్చితే.. ఎలాంటి పాత్రలు చేయడానికైన వెనుకాడనని అన్నారు.  

5 /6

నలుగురు పిల్లల తల్లిగా లేదా బామ్మ పాత్రలు వేయడానికి సైతం వెనుకాడనని రష్మిక స్పష్టం చేశారు. తాను సినిమాలో నటించి ఈ విధంగా పాపులారిటీ సంపాదిస్తానని ఎన్నడు అనుకోలేదన్నారు. తనకష్టమే తనను ఈ విధంగా పాన్ ఇండియా హీరోయిన్గా నిలబెట్టిందని అన్నారు.  

6 /6

ప్రస్తుతం రష్మిక మందన్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న దిగర్ల్ ఫ్రెండ్, సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబోలో వస్తున్న సికిందర్, ధనుష్ శేఖర్ కమ్ముల మూవీ కుబేర చిత్రాల్లో నటిస్తూ ఈ అమ్మడు బిజీగా ఉన్నారు.