Climbing Steps: మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటే ఆయవు పెరుగుతుందా

ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో వచ్చాక చాలామంది మెట్లెక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు. మీరు కూడా ఇలా చేస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటే మీ జీవితకాలం పెరుగుతుందంటే నమ్ముతారా...ఇది ముమ్మాటికీ నిజం. ఏకంగా 5 లక్షలమందిపై జరిగిన అధ్యయనం ఇది...

Climbing Steps: ఆధునిక జీవన విధానంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో వచ్చాక చాలామంది మెట్లెక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు. మీరు కూడా ఇలా చేస్తుంటే చాలా తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటే మీ జీవితకాలం పెరుగుతుందంటే నమ్ముతారా...ఇది ముమ్మాటికీ నిజం. ఏకంగా 5 లక్షలమందిపై జరిగిన అధ్యయనం ఇది...

1 /5

ఇటీవల దీనికి సంబంధించి ఓ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఏకంగా 5 లక్షలమంది డేటా విశ్లేషించారు. మెట్లెక్కి వెళ్తుండటం వల్ల ఫిట్నెస్ పెరగడమే కాకుండా జీవితకాలం కూడా పెరుగుతుందట. ఈ అధ్యయనం ద్వారా మెట్లు ఎక్కి వెళ్లేవారిలో మరణాల రేటు తక్కువగా ఉందని తేలింది.

2 /5

అయితే రోజుకు ఎన్ని మెట్లు ఎక్కితే మంచిది. ఎన్ని మెట్లు ఎక్కడం వల్ల ఆయువు పెరుగుతుందనేది కచ్చితంగా తెలియదు. రోజుకు 50 మెట్లు ఎక్కడం వల్ల ఎథెరోస్కెలెరోసిస్ ముప్పు 20 శాతకం తగ్గుతుంది.

3 /5

మెట్లు ఎక్కే క్రమంలో శరీరం గురుత్వాకర్షణ శక్తికి ప్రతిగా కదులుతుంది. దాంతో శారీరక శ్రమ కష్టమౌతుంది. దాంతో కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ మెరుగుపడుతుంది. కండరాలు పటిష్టమౌతాయి. వీపు దిగువ భాగంలో హైమస్ట్రింగ్ కండరాలు ఎదుగుతాయి. 

4 /5

ఈ అధ్యయనం ప్రకారం మెట్లెక్కేవారిలో వివిధ కారణాలతో మరణాల రేటు 24 శాతం ఉంది. గుండె పోటు మరణాలు 39 శాతం తగ్గాయి. 

5 /5

దైనందిన జీవితంలో లిఫ్ట్ ఉపయోగం పెరిగిపోతోంది. మెట్లెక్కి వెళ్లే మునుపటి రోజులు పోయాయి. వృద్ధుల సంగతి కాదు..యువకులు, కుర్రోళ్లు కూడా మెట్లెక్కడానికి ఆసక్తి చూపించడం లేదు. ఒక ఫ్లోర్ అయినా సరే లిఫ్ట్ కోసం నిరీక్షిస్తారు తప్ప..మెట్లెక్కి వెళ్లరు. తరచూ మెట్లు ఎక్కి వెళ్లడం చేస్తుంటే ఆరోగ్యానికి చాలామంచిదే కాకుండా ఇదొక బెస్ట్ కార్డియో వ్యాయామం అని చాలామందికి తెలియదు. ఆ వివరాలు తెలుసుకుందాం.