Yadadri Inauguration Photos: కన్నుల పండుగగా యాదాద్రి పున:ప్రారంభోత్సవం.. వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవ వేడుక కన్నుల పండుగగా జరిగింది. మిథునలగ్నంలో ఏకాదశి నాడు ఉదయం 11.55గంటలకు వేదపండితుల మంత్రోచ్చరణ నడుమ మహాకుంభ సంప్రోక్షణ క్రతువు అత్యంత వైభవోపేతంగా జరిగింది. అనంతరం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు.

  • Mar 28, 2022, 16:20 PM IST

Yadadri Inauguration Ceremony: యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవ వేడుక కన్నుల పండుగగా జరిగింది. మిథునలగ్నంలో ఏకాదశి నాడు ఉదయం 11.55గంటలకు వేదపండితుల మంత్రోచ్చరణ నడుమ మహాకుంభ సంప్రోక్షణ క్రతువు అత్యంత వైభవోపేతంగా జరిగింది. అనంతరం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు.

1 /10

యాదాద్రి పున:ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణకు తరలివచ్చిన భక్తులు...

2 /10

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాద్భుతమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రపంచంలోని మహా దేవాలయాల్లో ఒకటిగా యాదాద్రి నిలుస్తుందన్నారు.  

3 /10

మహాకుంభ సంప్రోక్షణ క్రతువులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు. 

4 /10

మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామి వారి సర్వ దర్శనానికి భక్తులకు అనుమతి.  

5 /10

మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భాలయంలో మూలవరుల దర్శనం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. 

6 /10

మహాకుంభ సంప్రోక్షణ తర్వాత ప్రధాన ఆలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఉపాలయాల్లోని ప్రతిష్ఠామూర్తులకు మహాప్రాణన్యాసం చేశారు. 

7 /10

మహాకుంభ సంప్రోక్షణ క్రతువు అనంతరం సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసిన వేదపండితులు..

8 /10

దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు... అనంతరం పవిత్ర జలాలతో అభిషేకం.

9 /10

యాదాద్రి రాజగోపురాలపై కలశాలకు 92 మంది రుత్వికులతో ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ క్రతువు నిర్వహించారు.

10 /10

మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు... ఆలయం లోపలి దృశ్యం...