Rythu Bharosa Scheme: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో రబీలోనే రైతుల ఖాతాలో ఎకరాకు రూ. 7500 రైతు భరోసా డబ్బులను జమా చేయనున్నట్లు చెప్పారు ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఒక్కో పథకం అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది.
రైతులకు మొదటగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. నేడు వారికి మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సీజన్ నుంచే సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం. నేడు ఎకరాకు రైతుల ఖాతాల్లో రూ.7500 రబీలోనే అందివ్వనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ తీపి కబురు అందించారు. రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ. 7500 జమ చేస్తున్నట్లు ప్రకటించారు.
రైతులకు ఖాతాల్లో ఈ డబ్బులను రబీ సీజన్ నుంచే జమ చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయం రైతులకు భారీ ఊరట నిస్తుంది. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా సన్నలకు రూ. 500 బోనస్ ఈ సీజన్లోనే అందించనున్నట్టు మనకు తెలిసిందే. ధాన్యం కొనుగోల చేసిన కేవలం 24 గంటల్లోనే డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. థర్డ్ పార్టీ వారి చేతుల్లోకి పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు.
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వనుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా రూ.6000 రైతుల ఖాతాల్లో జమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో మూడు విడతల్లో రూ.2000 జమా చేస్తున్నారు. పీఎం కిసాన్ యోజనలో భాగంగా ఈ డబ్బులు జమా చేస్తోంది. అక్టోబర్ 5వ తేదీన 18వ విడుత డబ్బులను జమా చేసింది.