Collagen Foods: ఈ ఫుడ్స్ తింటే ముఖానికి ఏ క్రీమ్ అవసరం లేదు.. కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే 5 ఆహారాలు ఇవే..

Collagen Produce Foods: ముఖం అందంగా కనిపించడానికి కొన్ని క్రీములు వాడతాం. వాటిలోని కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.  పార్లర్‌కు వెళ్లి వేల ఖర్చు పెడతారు అయితే సహజ సిద్ధంగా ముఖంపై కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. వాటిని డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
 

1 /5

కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరగడం వల్ల చర్మం యవ్వనంగా అందంగా కనిపిస్తుంది. ఇది చర్మం జుట్టుకు మేలు చేస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చకుంటే సహజసిద్దంగా కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ ఆహారాల జాబితా తెలుసుకుందాం.  

2 /5

ఆకుకూరలు.. ఆకుకూరలు తినాలి అని వైద్య నిపుణులు చెబుతారు. ముఖ్యంగా పాలకూర, కాలే వంటివి డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి, క్లోరోఫిల్ కోల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో త్వరగా వృద్ధాప్య ఛాయలు ముఖంపై కనిపించవు.

3 /5

బెల్ పెప్పర్స్.. రకరకాల రంగులో ఉండే ఈ బెల్ పెప్పర్స్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు అందం.. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం పై సహజసిద్ధంగా కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడతాయి.

4 /5

టమాటాలు.. టమాటాలలో విటమిన్ సి, లైకోపీన్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. హానికర యూవీ కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. టమాటలను రెగ్యులర్‌గా డైట్లో చేర్చుకోవడం వల్ల ముఖంపై సహజసిద్ధంగా కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

5 /5

బ్రోకోలీ.. బ్రోకోలి తినడం వల్ల కూడా ముఖంపై సహజసిద్ధంగా గ్లో అందుతుంది. ఇందులో విటమిన్ సి, జింక్, కాపర్ ఉంటుంది.. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే సెల్ఫోరాఫేన్  సహజసిద్ధంగా కొల్లెజెన్‌ పెరిగేలా చేసి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.