Deepavali 2024 Lighting Diyas: ఈరోజు దీపావళి పిల్లాపెద్దా అందరూ కలిసి వైభవంగా జరుపుకునే వెలుగుల దివ్వెల పండుగ. ఈరోజు మన జీవితంలో చీకట్లు తొలగి, వెలుగులు నిండాలని ఆ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, ఓ 5 ప్రదేశాల్లో దీపాలు ఇంట్లో పెట్టాలి.
దీపావళి సందర్భంగా ఇంటా, ఆరుబయట దీపాలు వెలిగిస్తారు. చిన్నాపెద్దా అందరూ కలిసి కనులవిందుగా వేడుక జరుపుకుంటారు. లక్ష్మీపూజ చేసి పటాకులు కాలుస్తారు.
అయితే, దీపావళి పండుగ రోజు కనీసం ఈ 5 ప్రదేశాల్లో కచ్చితంగా దీపాలు వెలిగించాలట. దీపావలి పండుగ సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదేశాల్లో వెలిగించాలని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో లక్ష్మీపూజలో దీపాలు వెలిగిస్తాం. నరక చతుర్ధశి నుంచి యమదీపం కూడా ఇంటి ఆరుబయట వెలిగిస్తారు. అయితే, ఇంటి పూజగదిలో కూడా దీపాలు వెలిగించాలి.
ముఖ్యంగా దీపావళి పండుగ రోజు ఇంటి బయట గడపకు ఇరువైపులా దీపాలు వెలిగించాలి. రావిచెట్టు, తులసికోట, ఇంటి కిచెన్‌లో కూడా దీపాలు వెలిగించాలి. అంతేకాదు కొందరి ఇళ్లలో ధాన్యాగారం కూడా ఉంటుంది. అక్కడ కూడా దీపాలు పెట్టాలి.
ఇంటి బయట చీకటి ఉన్న ప్రదేశాల్లో కూడా దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా ఇంటి ప్రతిమూలలో దీపం పెట్టాలి. చెట్ల వద్ద మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆలయంలో కూడా దీపాలు పెట్టాలి. ఇంటి వీధి కూడలి వద్ద కూడా దీపం వెలిగిస్తారు.