Pawan kalyan: కాషాయ దుస్తులో అకీరా నందన్.. తండ్రికి తగ్గ వారసుడంటూ పొంగిపోతున్న జనసైనికులు.. పిక్స్ వైరల్..

Akiranandan and aadya kashi trip: అకీరా నందన్, ఆద్య తన  తల్లి రేణు దేశాయ్ తో కలిసి కాశీ యాత్రలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. వీరి పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
 

1 /6

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం సనాతన ధర్మ కోసం తన ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలోనే హాట్ టాపిక్ గా మారాయి.

2 /6

అయితే..పవన్ కళ్యాణ్ పిల్లలు, ఆద్య, అకిరా నందన్ కూడా తండ్రికి తగ్గ బిడ్డలుగా మారారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తుంది. అదే విధంగా వారు ఎంతో సింపుల్ గా కాశీలో ఆటోలో జర్నీ చేసిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి.  

3 /6

మరొవైపు పవన్ మాజీ భార్య సైతం.. డిప్యూటీ సీఎం ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తొంది. ఇటీవల తన ఇంట్లో అనేక హోమాలు జరిపించారు. అదే విధంగా రేణు దేశాయ్ తల్లి చనిపోయినప్పుడు.. రిప్ అని కాకుండా.. స్వర్గలోక ప్రాప్తిరస్తూ అని కామెంట్లు పెట్టాలని అన్నారు.  

4 /6

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేణు దేశాయ్, తన పిల్లలు, ఆద్య, అకీరా నందన్ లు కాశీలో విశ్వనాథుడ్ని దర్శనం చేసుకున్నారు. అక్కడ అకీరా నందన్ కాషాయ దుస్తులు వేసుకున్నాడు. రేణు దేశాయ్ సైతం.. గంధం బొట్లు పెట్టుకుని విశ్వనాథుడిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది.  

5 /6

ప్రస్తుతం అకీరా నందర్ మాత్రం.. అచ్చం తండ్రికి తగ్గ కొడుకుగా మారాడని.. తండ్రి తర్వాత అంతటి వాడిలా అకిరా నందర్ మారుతాడని కూడా జనసైనికులు ఫుల్ ఖుషీ అవుతున్నారంట.  

6 /6

మరొవైపు పిల్లలిద్దర్ని రాయల్ గా, లగ్జరీ లైఫ్ లకు అలవాటు పడకుండా.. సింప్లిసిటీకి, ఆధ్యాత్మికతకు దగ్గరగా తీసుకెళ్తున్నందుకు.. రేణుదేశాయ్ పై సైతం.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారంట.