Yogi adityanath: తస్సాదియ్యా.. దీపావళి గిఫ్ట్ అంటే ఇది.. ఉద్యోగులకు యోగి సర్కారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా..?

1 /6

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా దీపావళి పండగ సందడి కన్పిస్తుంది. దీపావళిని ఐదురోజుల పండగ అని చెప్తుంటారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి, భాయ్ దుజ్ గా జరుపుకుంటారు.

2 /6

అయితే.. ఉత్తరాదిన దీపావళిని ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళికి ప్రతి ఒక్కరు తమ ఇంటికి తప్పకుండా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఇప్పటికే దీవాళి సందర్భంగా ప్రభుత్వాలు సెలవులు సైతం ప్రకటించాయి.  

3 /6

ఇదిలా ఉండగా... ఉత్తర ప్రదేశ్ యోగి సర్కారు ఇప్పటికే దీపావళి నేపథ్యంలో.. అన్ని ప్రభుత్వ ఆఫీసులు,స్కూళ్లు, కాలేజీలకు అక్టోబరు 31 నుంచి నవంబరు 1 వరకు సెలవులు ప్రకటించింది.   

4 /6

అయితే.. నవంబరు 2 శనివారం, నవంబరు 3న ఆదివారం కావడంతో యోగి సర్కారుకు సీఎం ప్రత్యేకంగా ఉద్యోగులు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో దీనికి సానుకూలంగా స్పందించిన యోగి సర్కారు.. అన్ని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబరు 2 కూడా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు.

5 /6

దీంతో ప్రస్తుతం ఇటు ఉద్యోగులకు, అందరికి కూడా నవంబరు 3 ఆదివారం కూడా కావడంతో వరుసగా.. 4 రోజుల పాటు సెలవులు దొరికినట్లైందని చెప్పుకొవచ్చు. దీంతో సొంత గ్రామాలకు వెళ్లిన వారు తమవారితో సరదాగా గడిపేందుకు, పండగను ఎంజాయ్ చేసుకునేందుకు మరింత అవకాశం దొరికినట్లు తెలుస్తొంది.

6 /6

ఈ నేపథ్యంలో యోగీ సర్కారు నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తొంది. మరొవైపు ఇప్పటికే దీపావళి నేపథ్యంలొ సొంత గ్రామాలకు వెళ్లేవారితో బస్సులు,రైళ్లు, విమానాలు కూడా ఫుల్ గా ఉంటున్నారు. చాలా మంది సొంత వాహానాల్లో సైతం తమ గ్రామాలకు వెళ్తున్నారు.