Bharath VS Canada: అవును.. అది మేమే లీక్‌ చేశాం.. భారత్‌పై కెనడా మరో కుట్ర..

Canada admits leaked information : రోజురోజుకు ఇండియా కెనడా బంధం మరింత దిగజారుతోంది. రోజుకో కొత్త  వివాదాన్ని కెనడ ప్రభుత్వం తీసుకువస్తూ భారత్‌పై అక్కాసు వెళ్లగక్కుతుంది. ఎప్పుడూ ఒకే వైఖరి, ప్రతి క్షణం ఖలిస్థానీ వేర్పాటువాదులను వెనకేసుకుని భారత్‌పై దూకుడుగా వ్యవహరించడం. తాజాగా మరో వివాదానికి తెరతీసింది కెనడా ప్రభుత్వం..
 

1 /5

భారత్‌పై ఎప్పటి కప్పుడు అక్కసు వెళ్లగక్కుతున్న కెనడా తాజాగా అమిత్‌ షాను మరోసారి టార్గెట్‌ చేసింది. ఖలిస్తానీ టెర్రరిస్టు నిజ్జర్‌ హత్యకు అమిత్‌ షా ప్రేరేపించారని చెబుతోంది.  

2 /5

అంతేకాదు కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుని అమిత్‌ షా ఆధ్వర్యంలోనే దాడులకు పాల్పడుతోందని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డెవిడ్‌ మోరిసన్ చెప్పారు.  

3 /5

నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశాం. ఆ వివరాలను అమెరికా పత్రిక అయిన వాషింగ్టన్‌కు లీక్‌ చేసినట్లు ఆమె అంగీకరించారు. దీన్ని ట్రూడో అనుమతి లేకుండానే లీక్‌ చేశాము, వారు ఇప్పటికే మా వ్యవహారాలను పర్యవేక్షిస్తూనే ఉన్నారన్నారు.   

4 /5

ఖలిస్తానీ ఉగ్రవాదులను వెన్నుదన్నుగా ఉంటూ ట్రూడో ప్రభుత్వం పనిచేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఓటు బ్యాంక్‌ కోసం ఇలా దిగజారిన పనులు చేస్తున్నారు. ఎప్పికప్పుడు ఢిల్లీ కూడా జవాబు కెనడాకు ఇస్తూనే ఉంది. నిజ్జర్‌ హత్య కేసుకు అమిత్‌ షా కు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.  

5 /5

ఖలిస్తానీ ఉగ్రవాదులు మాత్రం ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపులు కూడా బాగా పెరిగాయి ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలని చెప్పడం గమనార్హం.