Dolphins Lifespan: డాల్ఫిన్లు ఎంతకాలం జీవించగలవు, భూమిపై ఎంత సేపు బతుకుతాయి

మనిషితో ఫ్రెండ్లీగా ఉండే సముద్రజీవి డాల్ఫిన్. అందుకే పిల్లకు డాల్ఫిన్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అదే సమయంలో డాల్ఫిన్ జాతి అంతరించిపోతుందనేది కూడా వాస్తవం. నీళ్లలా చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఈ డాల్ఫిన్లు ఎంత కాలం జీవిస్తాయో మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం.

Dolphins Lifespan: మనిషితో ఫ్రెండ్లీగా ఉండే సముద్రజీవి డాల్ఫిన్. అందుకే పిల్లకు డాల్ఫిన్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అదే సమయంలో డాల్ఫిన్ జాతి అంతరించిపోతుందనేది కూడా వాస్తవం. నీళ్లలా చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఈ డాల్ఫిన్లు ఎంత కాలం జీవిస్తాయో మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం.

1 /5

డాల్ఫిన్ల జీవితకాలం 60 ఏళ్ల వరకూ ఉంటుంది. కొన్ని ఆడ డాల్ఫిన్లు ప్రత్యేక పరిస్థితుల్లో 90 ఏళ్లు కూడా జీవించగలవు.  ఓర్కాస్ రకం డాల్ఫిన్ ఎక్కువ కాలం జీవిస్తుంది. నీళ్లలోంచి బయటికొచ్చాక భూమ్మీద కేవలం కొన్ని గంటలే జీవించగలదు

2 /5

డాల్ఫిన్లు ఎంతకాలం జీవిస్తాయనేది డాల్ఫిన్ జాతిని బట్టి ఉంటుంది. ఒక్కో జాతీ డాల్ఫిన్ జీవితకాలం ఒక్కోలా ఉంటుంది. దాంతోపాటు పర్యావరణం, , వాటి ఆరోగ్యం కూడా ప్రభావం చూపిస్తుంది. 

3 /5

డాల్ఫిన్లకు నీరు చాలా అవసరం. నీరున్నంతవరకే అవి బతుకుతాయి. ఎక్కువగా ఎగిరెగిరి వచ్చి ఒడ్డున పడుతుంటాయి. అలాంటప్పుడు వాటిపై వెంటనే నీరు పోయడం లేదా నీళ్లలో వదిలేయడం చేస్తుండాలి. లేకపోతే ఎక్కువ సేపు బతకలేవు. భూమిపై ఎక్కువ సేపు ఉండలేవు. బయట వాతావరణం చల్లగా, తేమగా ఉంటే కాస్త తట్టుకోగలుగుతాయి.

4 /5

డాల్పిన్ల శరీర నిర్మాణం, అవయవాల తీరు నీటిలో జీవించేందుకు అనువుగా ఉంటాయి. శరీరం వెలుపల తలభాగంలో ఉండే బ్లో హోల్ ఆధారంగా ఇవి గాలి పీల్చుకుంటాయి. వీటి శరీరంపై ఉండే బ్లబ్బర్ పొర ఇన్సులేషన్‌లా పనిచేస్తుంది. 

5 /5

డాల్ఫిన్లు పరిమాణంలో భారీగానే ఉన్నా మనిషికి ఎలాంటి ఆపద కలిగించవు సరికదా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అయితే నీళ్లలోంచి బయటికొచ్చిన ప్రతిసారీ వాటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. డాల్ఫిన్ ఎంతకాలం జీవిస్తుందనేది ఆరోగ్యం, పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది.