EPFO: ఉద్యోగులకు బిగ్ అలర్ట్..జనవరి 15లోపు ఈ పని చేయండి. లేదంటే మీరు ELI స్కీమ్ బెనిఫిట్స్ పొందలేరు

EPFO News: ఈఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ పొందేందుకు ఇప్పుడు కేవలం మూడు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. దీని గడువు జనవరి 15వ తేదీతో ముగియనుంది. 
 

1 /7

EPFO News: ప్రభుత్వ ఎంప్లాయ్ మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను యాక్టివ్ చేయించుకోవాలి. అలాగే వారి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ను లింక్ చేసుకోవాలి. దీని కోసం ఇప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యులకు ముఖ్యంగా కొత్త ఉద్యోగులకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.   

2 /7

మీరు ఈ మధ్యే ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లయితే జనవరి 15 నాటికి మీ యూఏఎన్ నెంబర్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇది కాకుండా బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేయడం కూడా చాలా అవసరం.   

3 /7

యూఏఎన్ ను యాక్టివేట్ చేసుకునేందుకు బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ గడువును జనవరి 15, 2025 వరకు పొడిగించింది. ముందుగా యూఏఎన్ యాక్టివేట్ చేసేందుకు చివరి తేదీ నవంబర్ 30, 2024గా ఉంది. అయితే ఆ తర్వాత డిసెంబర్ 15, 2024వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15 నుంచి జనవరి 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ జనవరి 15వ తేదీతో చివరి గడువు ముగియనుంది.   

4 /7

బడ్జెట్ 2024లో ప్రభుత్వం ఈ ఈఎల్ఐ స్కీమును ప్రకటించింది. ఈ స్కీములో 3 రకాల స్కీములు ఉన్నాయి. ఏ, బీ, సీ ఈ మూడు స్కీముల లక్ష్యం ఉపాధి కల్పనను ప్రోత్సహించడం. అలాగే కొత్త ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం. 

5 /7

యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకునేందుకు ముందుగా మీరు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు epfindia.gov.inకు లాగిన్ అవ్వండి.   

6 /7

ఎడమ వైపు కనిపించే సర్వీసుల విభాగంలో ఫర్ ఎంప్లాయిస్ పై క్లిక్ చేస్తే సేవల కాలమ్ లో రెండవ స్థానంలో కనిపించే మెంబర్ యూఏఎన్ ఆన్ లైన్ సర్వీస్ ఓసీఎస్ ఓటీసీపీ పై క్లిక్ చేయండి. దీని తర్వాత యాక్టివేట్ యూఏఎన్ పై క్లిక్ చేయండి.   

7 /7

ఇప్పుడు 12 అంకెల యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్, క్యాప్చాకోడ్ మొదలైనవాటిని ఎంటర్ చేయండి. దీని తర్వాత కింద ఇచ్చిన డిక్లరేషన్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కింద కనిపించే గెట్ ఆథరైజేషన్ పిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని నింపి బటన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది.