Telangana Govt Employees Issues: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని కొంతమంది ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి కేసులు వేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉద్యోగులకు, పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హరీష్ రావు ఎండగట్టారు.
సిద్దిపేటలో NGO భవన్‌కు తనకు ఎంతో అనుబంధం ఉందని హరీష్ రావు అన్నారు. ఉద్యోగులు పదవీ విరమణ పొందితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా కొంత బలపడతామని ఆశపడతారని.. రిటైర్ అయ్యాక ఇల్లు కట్టుకుందామని, బిడ్డ పెళ్లిళ్లు చేద్దామని ఆశలు పెట్టుకుంటారన్నారు.
రాష్ట్ర ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టుకు వెళుతున్న పరిస్థితి నెలకొందని.. పెన్షన్ బెనిఫిట్స్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జీతాలు కూడా ఆలస్యంగా చెల్లిస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలస్యంగా చెల్లించినా.. అన్ని బెనిఫిట్స్ ఇచ్చామని గుర్తు చేశారు.

తమ ప్రభుత్వంలో హెల్త్ బెనిఫిట్స్, డీఏలు, పీఆర్సీలు ఉండేవని.. కాంగ్రెస్ వచ్చాక పీఆర్సీ పత్తా లేకుండా పోయిందని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 73 శాతం పీఆర్సీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవా..? అని ప్రశ్నించారు.
ఉద్యోగులకు కేసీఆర్ తగిన గౌరవం ఇచ్చారని.. ఈ ప్రభుత్వం ఏసీబీతో ఉద్యోగులను వేధిస్తుందని మండిపడ్డారు. కరీంనగర్‌లో మహిళా కలెక్టర్‌తో మంత్రి దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.