Feet Massage Remedies: రోజూ పడుకునే ముందు వేడి నూనెతో పాదాల మాలిష్‌తో నమ్మలేని లాభాలు

Feet Massage Remedies: ఆధునిక బిజీ ప్రపంచంలో ఆరోగ్యంపై ధ్యాస అనేది ఉండటం లేదు. ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే లభించడం లేదు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల్నించి గట్టెక్కవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. 

Feet Massage Remedies: రోజూ రాత్రి పడుకొనేటప్పుడు వేడి నూనెతో పాదాల్ని గట్టిగా మాలిష్ చేసుకుంటే శరీరంలో కలిగే 5 అద్భుత ప్రయోజనాలను మీరు ఊహించలేరు. దీనికోసం నువ్వుల నూనె, గానుగ నూనె లేదా కొబ్బరి నూనె వినియోగించవచ్చు. 

1 /5

జీర్ణక్రియ మెరుగుపడటం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పాదాలు మాలిష్ చేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రి తిన్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది

2 /5

అలసట, నొప్పులు మాయం రోజంతా పడిన అలసట, ఒత్తిడి కాళ్లలో కన్పిస్తుంటుంది. అందుకే రోజూ రాత్రి పడుకొనేటప్పుడు వేడి నూనెతో పాదాలు మాలిష్ చేస్తే కండరాలు ఫ్రీ అవుతాయి. ఒత్తిడి దూరమౌతుంది. నొప్పులు, అలసట దూరమౌతాయి

3 /5

మెరుగైన నిద్ర వేడి నూనెతో పాదాలు మాలిష్ చేసుకుంటే ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుది. దాంతో మంచి మెరుగైన నిద్ర పడుతుంది

4 /5

ఒత్తిడి, ఆందోళన దూరం పాదాల్లో కొన్న ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని వివిధ అంగాలతో అనుసంధానమై ఉంటాయి. అందుకే పాదాలు మాలిష్ చేస్తే ఒత్తిడి, ఆందోళన తొలగిపోతాయి

5 /5

మెరుగైన రక్త ప్రసరణ వేడి నూనెతో మాలిష్ చేసుకుంటే నరాలు యాక్టివ్‌గా ఉంటాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది