Flax Seeds Recipes: ప్రకృతిలో లభించే కొన్ని రకాల పదార్ధాల్లో శరీరం సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు చాలా ఉంటాయి. అలాంటివే ఫ్లక్స్ సీడ్స్. ఆరోగ్యపరంగా వీటిని సూపర్ ఫుడ్ అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య దూరమౌతుంది.
Flax Seeds Recipes: అయితే ఫ్లక్స్ సీడ్స్ ఎలా తీసుకోవాలనేది చాలామందిలో సందేహం ఉంటుంది. ఫ్లక్స్ సీడ్స్తో కొన్ని అద్భుతమైన పదార్ధాలు చేసుకుని తినవచ్చు. ఆ రెసిపీస్ ఏంటనేది తెలుసుకుందాం.
ఫ్లక్స్ సీడ్స్ అవకాడో టోస్ట్ ఒక పండిన అవకాడోని ఉప్పు, మిరియాలతో కలిపి మ్యాష్ చేసుకుని టోస్ట్ పై అమర్చాలి. దానిపై ఫ్లక్స్ సీడ్స్ , మిరియాల పౌడర్ చల్లాలి. బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి
ఫ్లక్స్ సీడ్స్ డైట్లో చేర్చడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, మినరల్స్ , విటమిన్లు అందడమే కాకుండా ఎందులో కలుపుతున్నా ఆ పదార్ధం రుచి కూడా పెరుగుతుంది. ఫ్లక్స్ సీడ్స్ 5 వంటకాలు చేయవచ్చు.
ఫ్లక్స్ సీడ్స్ లడ్డూ ఓ గిన్నెలో ఫ్లక్స్ సీడ్స్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుని టోస్ట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వేడి నెయ్యి, బెల్లం కలపాలి. వీటిని లడ్డూ ఆకారంలో మల్చుకుని స్టోర్ చేసుకోవచ్చు.
ఫ్లక్స్ సీడ్స్ క్రేకర్ ఓ గిన్నెలో ఫ్లక్స్ సీడ్స్, నీళ్లు, ఉప్పు, నచ్చిన మసాలాలు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ షీట్ పై పల్చగా వేయాలి. 15-20 నిమిషాలు బేక్ చేయాలి. అంతే రుచికరమైన ఫ్లక్స్ సీడ్స్ క్రేకర్ సిద్ధం
ఫ్లక్స్ సీడ్స్ యోగర్ట్ ఓ గిన్నెలో ఓట్స్, యోగర్ట్, ఫ్లక్స్ సీడ్స్, డ్రై క్రేన్ బెర్రీలు, తేనె తీసుకుని కలుపుకోవాలి. రాత్రంతా ఫ్రిజ్లో ఉంచి తినాలి.
ఫ్లక్స్ సీడ్స్ మఫిన్ తృణ ధాన్యాల పిండి, ఫ్లక్స్ సీడ్స్ , నిమ్మ తొక్కలు, గసగసాలు, గుడ్లు, తేనె, వెనిలా ఎక్స్ట్రాక్ట్ కలపాలి. బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు కలిపి బేక్ చేయాలి.