Friendship day 2024: స్నేహం విలువ గురించి చెప్పాలంటే మాటలు లేవు. అది రెండు హృదయాల స్పందన.. తల్లిదండ్రులు.. భార్యా పిల్లలకు చెప్పుకోలేని ఎన్నో విషయాలను మనం పంచుకునేది స్నేహితులతోనే అని చెప్పాలి. త్యాగాన్ని కోరేది.. వజ్రం కన్నా దృఢమైన స్నేహాన్ని చాటి చెప్పిన న్యూ ఏజ్ తెలుగు సినిమాల విషయానికొస్తే..
ప్రేమ దేశం.. ప్రేమకు కొత్త అర్ధాన్ని చెప్పిన చిత్రం ‘ప్రేమ దేశం’. అబ్బాస్, వినీత్, టబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ్రెండ్ షిప్ చిత్రాల్లో మేటి సినిమాగా నిలిచింది.
ఉన్నది ఒకటే జిందగీ: ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అత్యుత్తమ స్నేహ చిత్రాల్లో రామ్, శ్రీ విష్ణు హీరోలుగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది.
హ్యాపీ డేస్: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిఖిల్, వరుణ్ సందేశ్, తమన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ‘హ్యాపీ డేస్’ చిత్రం స్నేహానికి సరికొత్త అర్ధం చెప్పిందనడంలో సందేహం లేదు.
అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్: ఫ్రెండ్షిప్ పై వచ్చిన చిత్రాల్లో స్నేహాన్ని గొప్పగా చూపించన మూవీ ‘అంకిత పల్లవి అండ్ ఫ్రెండ్స్’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది.
నీ స్నేహం: ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘నీ స్నేహం’ సినిమా అత్యుత్తమ స్నేహ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
కేరింత: ఫ్రెండ్ షిప్ డే వచ్చిన చిత్రాల్లో ‘కేరింత’ కూడా ఉంది. ఈ సినిమా ఇప్పటి యూత్ కు ఆలోచన విధానలను ప్రతిబించింది.
ఆర్య 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, నవదీప్, కాజల్ హీరో, హీరోయిన్లుగా ‘ఆర్య2’ కూడా స్నేహం విలువను చాటి చెప్పిన చిత్రాలో ఒకటిగా నిలిచిపోయింది.
ఎవడే సుబ్రమణ్యం: నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. ఈ సినిమా కూడా స్నేహం విలువతో తెరకెక్కింది.
స్నేహితుడు: శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్నేహితుడు’ సినిమా పేరులోనే స్నేహం విలువను చాటి చెప్పింది.
ఓ మై ఫ్రెండ్: స్నేహం విలువను చాటి చెప్పిన చిత్రాల్లో ‘ఓ మై ఫ్రెండ్’ కూడా స్నేహానికి కొత్త అర్ధం చెప్పింది.