Health Tips: ఇండియాలో అత్యంత ఎక్కువగా, మక్కువగా సేవించేది టీ. ఉదయం లేవగానే టీ తాగడం చాలా ఇష్టపడుతుంటారు. సాధారణం టీతో పాటుగా బిస్కట్, బ్రెడ్ వంటి పదార్ధాలు తింటారు. ఇంకొంతమంది వేర్వేరు పదార్ధాలు తింటారు. అసలీ అలవాటు మంచిదేనా కాదా, టీతో పాటు ఎలాంటి పదార్దాలు తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదో తెలుసుకుందాం..
టీతో పాటు కొన్ని రకాల పదార్ధాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీ తో పాటు తీసుకోకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆహారం విషతుల్యం కావచ్చు. లేదా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు.
పసుపు టీతో పాటు పొరపాటున కూడా పసుపు తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కరూమిన్, ట్యానిన్ కడుుపుకు సమస్యగా మారుతుంది. ఫలితంగా మలబద్ధకం, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు రావచ్చు
ఆకు కూరలు టీతో పాటు ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరల్ని పొరపాటున కూడా తీసుకోకూడదు. దీనివల్ల ఐరన్ సంగ్రహణ తగ్గిపోతుంది. ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
పకోడీ టీతో పాటు చాలామందికి పకోడీ తినడం అత్యంత ఇష్టం. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఈ కాంబినేషన్ కన్పిస్తుంది. కానీ ఇది మంచిది కాదు. ప్రేవుల్లో సమస్య ఏర్పడుతుంది.
ఫ్రూట్స్ ఉదయం లేవగానే టీ తాగే అలవాటుండి..బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు తీసుకుంటే మాత్రం రెండింటీ మద్య ఎక్కువ సమయం ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు.
పెరుగు పెరుగు లేదా పెరుగుతో చేసిన పదార్దాలను టీతో పాటు తీసుకోకూడదు. ఇది మంచి అలవాటు కాదు. ఎందుకంటే రెండూ ఎసిడిక్ పదార్దాలే. ఆరోగ్యంపై దుష్ప్రబావం పడుతుంది.
లెమన్ జ్యూస్ టీ తాగడానికి ముందు లేదా తరువాత కొద్ది వ్యవధిలో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదగు. దీనివల్ల కడుపు ఉబ్బిపోతుంది. దాంతోపాటు జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.