Most Ducks in IPL History: కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు వీళ్లే..!
ఈ సీజన్‌లో రోహిత్ శర్మ రెండుసార్లు డకౌట్ అయ్యారు. మొత్తంగా 16సార్లు డకౌట్ అయి.. మొదటిస్థానంలో నిలిచాడు.
రెండోస్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ ఉన్నాడు. 158 మ్యాచ్‌ల్లో 15సార్లు డకౌట్ అయ్యాడు.
మన్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో 15సార్లు డకౌట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీల తరపున 110 మ్యాచ్‌లు ఆడాడు.
ఆర్‌బీసీ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా ఐపీఎల్‌లో 15సార్లు డకౌట్ అయ్యాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్, కింగ్స్ XI పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు.
చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు 199 మ్యాచ్‌ల్లో 14 సార్లు డకౌట్ అయ్యాడు.