Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు

Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఓ కారణమైతే..ఫ్యామిలీ హిస్టరీ కూడా మరో కారణం కావచ్చు. 

Heart Attack Risk: మీ కుటుంబంలో కూడా హార్ట్ ఎటాక్ హిస్టరీ ఉంటే పొరపాటున కూడా ఈ 5 అలవాట్లు దరిచేరనివ్వద్దు. వీటికి దూరంగా ఉంటే గుండె వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. 
 

1 /5

ఒత్తిడి ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా గుండెపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి. 

2 /5

జంక్ ఫుడ్స్ ఫ్యాట్ అనేది శరీరానికి అవసరమే. కానీ తగిన మోతాదులో ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ పదార్ధాల్లో అన్ హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధుల ముప్పు ఉంటుంది.

3 /5

మద్యపానం ఒక్క డ్రాప్ మద్యం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమే. మద్యం తాగేవారిలో కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. దాంతోపాటు హార్ట్ దెబ్బతినవచ్చు. గుండె వేగంగా కొట్టుకుంటుంది.

4 /5

శారీరక శ్రమ లోపించడం శారీరక శ్రమ లేకపోవడం, హెల్తీ లైఫ్‌స్టైల్ లేకపోవడం కూడా కారణాలు. సాధారణంగా చాలామంది స్థూలకాయం ఉన్నప్పుడే ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు. కానీ హార్ట్ ఎటాక్ వంటి వాటి నుంచి కాపాడుకునేందుకు ఎప్పుడూ ఇది అవసరమే

5 /5

స్మోకింగ్ హార్ట్ ఎటాక్ ఫ్యామిలీ హిస్టరీ కారణంగా మీకు ఆ ముప్పు ముందే పొంచి ఉంటుంది. ఈ క్రమంలో స్మోకింగ్ చేస్తే హార్ట్ ఎటాక్ త్వరగా రావచ్చు. సిగరెట్‌లో ఉండే నికోటిన్ రక్తాన్ని చిక్కగా చేసి గుండెను బలహీనం చేస్తుంది