Heroine: టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్న నటి..!

Murali Mohan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మురళీమోహన్.. ఒక అమ్మాయిని ప్రేమించారని, ఆమె ఈయన వల్లే జీవితం నాశనం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతటి అసలు ఆ హీరోయిన్ ఎవరు ఏమి జరిగింది అనేది ఒకసారి చూద్దాం.
 

1 /5

ఏ ఇండస్ట్రీలో నైనా సరే.. హీరోయిన్స్ తక్కువ సమయంలోనే ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. అందుకే అవకాశం ఉన్నప్పుడే చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలోనైనా నటించి క్రేజ్ సంపాదించుకొని బాగానే వెనకేసుకుంటున్నారు. మరి కొంతమంది అందంగా కనిపించడం కోసం సర్జరీలు మంచివి చేయించుకుంటూ ఉండగా.. కానీ ఒక హీరోయిన్ మాత్రం హీరోయిన్గా అవకాశాల కోసం అతి చిన్న వయసులోనే.. అందంగా కనిపించడానికి హార్మోన్ ఇంజక్షన్లు,  స్టెరాయిడ్స్ వంటివి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్లే ఈ హీరోయిన్ కెరియర్ కూడా నాశనం అయ్యిందని సమాచారం. 

2 /5

ఇక ఆమె ఎవరో కాదు సీనియర్ బ్యూటీ దీపా. 1970,80 లలో ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఈమె.. సీనియర్ ఎన్టీఆర్ తో,  మురళీమోహన్ తో కలిసి నటించి, తిరుగులేని హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. 

3 /5

అంతేకాకుండా అప్పట్లో సీనియర్ నటుడు మురళీమోహన్, దీపా ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఈమె అందానికి మురళీమోహన్ కూడా పెద్ద అభిమానిగా మారిపోయారని, కానీ రిలేషన్ గురించి చాలా సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు.   

4 /5

దీపా, తాను ఎక్కువగా సినిమాలలో కలిసి నటించడం వల్లే అలాంటి రూమర్స్ వినిపించాయని,  కానీ తాను ఎప్పుడూ ఆమెను ప్రేమించలేదని ఆ దృష్టితో చూడలేదని కూడా తెలిపారట. అలాగే శ్రీదేవి అంతటి అందగత్తె దీపా అని, కెమెరా ను ఏ యాంగిల్ లో చూపించినా కూడా ఆమె అందంగానే ఉంటుంది అంటూ తెలిపారు.

5 /5

చిన్నతనంలోనే హీరోయిన్గా మారిన దీప, తన అందం పెరగడానికి స్వయంగా ఈమె తల్లి స్టెరాయిడ్ ఇచ్చిందని చాలామంది చెబుతూ ఉంటారు.  ఈ విషయాన్ని తన దృష్టికి వచ్చిందని మురళీమోహన్ తెలిపారు. కానీ ఆమె చాలా అధిక బరువు వల్లే సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయని తెలియజేశారు.