Diabetes Remedies: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. మధుమేహం అనేది ప్రతి పది మందిలో నలుగురికి కచ్చితంగా ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండాలి. జీవనశైలి బాగుండాలి. ఆ వివరాలు మీ కోసం.
డయాబెటిస్ రోగులు అందుకే గ్లూకోజ్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినకూడదు. బంగాళదుంప, షుగర్, స్వీట్ పొటాటో వంటివి తినకూడదు. స్ప్రౌట్స్, ఫ్లక్స్ సీడ్స్, మఖనా వంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పదార్ధాలు మాత్రమే తినాలి. ఇంకా సులభంగా చెప్పాలంటే కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినాలి.
శరీరంలో ఇన్సులిన్ లోపం ఉంటే అదనపు గ్లూకోజ్ గ్లైకోజన్‌గా మారదు. శరీరం గ్లూకోజ్‌ను నేరుగా స్టోర్ చేయదు. దాంతో రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం వ్యాధికి కారణమౌతుంది. శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. అందుకే యూరిన్ టెస్ట్‌తో కూడా డయాబెటిస్ నిర్ధారిస్తారు.
సులభంగా చెప్పాలంటే మనం తినే ఆహారం ద్వారా శరీరంలో గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఇది కాస్త రక్తంలో కలిసి శరీరానికి ఎనర్జీ అందిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ గ్లూకోజ్‌ను గ్లైకోజన్‌గా మార్చి లివర్‌లో స్టోర్ చేస్తుంది. శరీరానికి గ్లూకోజ్ అవసరం అయినప్పుడు గ్లూకోగోన్ హార్మోన్ కాస్తా గ్లైకోజన్‌ను తిరిగి గ్లూకోజ్‌గా మారుస్తుంది.
శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం ప్రధాన సమస్యగా మారింది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ రోగులకు శారీరక శ్రమ అవసరం. వ్యాయామం చేస్తుండాలి. కేలరీలు సాధ్యమైనంతలో బర్న్ చేస్తుండాలి.