Hyderabad Job Fair: యువతకు సువర్ణ అవకాశం ఇది నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు. హైదరాబాద్ నాంపల్లిలో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. రెడ్ రోజ్ ప్యాలస్‌లో ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలంటే కావాల్సిన అర్హత ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్ నాంపల్లి వేదికగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో అనేక ఐటీ, ఫార్మా కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో వివిధ బ్యాంకులు, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన జాబ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఆస్తక్తి ఉన్న అభ్యర్థులు హాజరు అవ్వచ్చు.
ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరు అయ్యే అభ్యర్థులు పదో తరగతి ఆ పై చదివి ఉండాలి. వీరికి ముందుగా ప్రిలిమినరీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రామ్‌కు హాజరు అవ్వాల్సిన అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
నాంపల్లి రెడ్ రోజ్ ప్యాలస్ వేదికగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా నవంబర్ 9న శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర వివరాల కోసం 8374315052 నంబర్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ జాబ్ మేళాలో దాదాపు 60 కంపెనీలు పాల్గొంటాయి. ఎంపికైన అభ్యర్థులకు స్పాట్ అపాయింట్మెంట్ కూడా ఇస్తారు. ఈ జాబ్ ఫెయిర్ లో వర్క్ ఫ్రం హోం అందించే ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
ఇందులో నర్సింగ్ ఫార్మా, టీచింగ్, మార్కెటింగ్, హోటల్ మేనెజ్మెంట, సేల్స్, మెకానికల్ ఇంజినీర్, వాయిస్, నాన్ వాయిస్ జాబ్స్, అకౌంట్స్‌కు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉండనున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఫ్రెషర్స్ లేదా అనుభవం ఉన్నవారికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి సరైన పత్రాలు కలిగి ఉన్నవారు ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరు అవ్వచ్చు. వారితోపాటు సరైన పత్రాలు బయోడేటా, ఫోటో కూడా తీసుకురావాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు 130 జాబ్ ఫెయిర్స్ నిర్వహించామని, ఇందులో 17 వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందారని జాబ్ ఫెయిర్ నిర్వహకులు మన్నాన్ చెప్పారు. ఈ కెరీర్ అవకాశాలతోపాటు అభ్యర్థులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నామని అన్నారు.