Hyundai Ioniq 9 Price: 20 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే.. 620 కిమీ మైలేజీ.. హ్యుందాయ్ కొత్త కారు ఇదే..

Hyundai Ioniq 9 Price In India: భారత్ మొబిలిటీ 2025 ఎక్స్‌పోలో భాగంగా అన్ని రకాల ఆటో మొబైల్‌ కంపెనీల నుంచి కొత్త కొత్త కార్లు, మోటర్స్‌ సైకిల్స్‌ పరిచయమవుతున్నాయి. అలాగే కొన్ని కొత్త బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు, బైక్‌లు కూడా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన అద్భుతమైన కారును పరిచయం చేసింది. అయితే ఈ కారేంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

హ్యుందాయ్ కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ SUVని Ioniq 9 పేరుతో ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించారు. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో ప్రత్యేకమైన డిజైన్‌తో కంపెనీ పరిచయం చేసింది. ఈ కారు గత మోడల్‌ కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ మోడల్‌ మూడు వరుసలతో అందుబాటులోకి రానుంది.     

2 /5

అలాగే ఈ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV కారు ఫ్రంట్‌ సెటప్‌లో భాగంగా అద్భుతమైన LED సిగ్నేచర్ లైట్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్పెషల్‌గా 21 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఈ కారలో అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ కూడా లభించనుంది.    

3 /5

ఇక ఈ కారు వెనక భాగంలో  620 లీటర్ల బూట్ స్పేస్‌ ఆప్షన్‌ కూడా లభించబోతోంది. అలాగే కార్‌ కంట్రోల్‌ను చూపించేందుకు ప్రత్యేకమైన 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా లభిస్తోంది. అంతేకాకుండా కారును కంట్రోల్‌ చేసేందుకు 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది.     

4 /5

అంతేకాకుండా ఈ కారులో అద్భుతమైన డిజిటల్ సైడ్ మిర్రర్స్‌తో పాటు హైవే డ్రైవింగ్ అసిస్ట్-2 ఫీచర్స్‌ కూడా లభిస్తాయి. అలాగే రిమోట్ స్మార్ట్ పార్కింగ్ అసిస్ట్-2, ABS, EBD, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.  

5 /5

అలాగే ఈ Ioniq 9 కారులో స్పెషల్ రియర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు ISOFIX చైల్డ్ ఎంకరేజ్ వంటి ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. దీంతో పాటు ఈ కారు కేవలం  20 నిమిషాల పాటు ఛార్జ్‌ చేస్తే చాలు  620 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది. దీని ధర గత మోడల్‌ కంటే రూ.2 లక్షలు ఎక్కువగానే ఉండే ఛాన్స్‌ ఉంది.