International Coffee Day: ప్రపంచ కాఫీ దినోత్సవం ఈరోజు, కాఫీతో ప్రయోజనాలు, నష్టాలివే

నిత్య జీవితంలో కాఫీ, టీ అనేవి ఓ భాగంగా మారిపోయాయి. ఇవాళ అంటే అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ ఆరోగ్యానికి మంచిదా కాదా, రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తీసుకోవాలి అనే అంశాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాఫీ వల్ల ప్రయోజానాలున్నాయా లేదా నష్టాలున్నాయా అనేది పరిశీలిద్దాం. 

International Coffee Day: నిత్య జీవితంలో కాఫీ, టీ అనేవి ఓ భాగంగా మారిపోయాయి. ఇవాళ అంటే అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ ఆరోగ్యానికి మంచిదా కాదా, రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తీసుకోవాలి అనే అంశాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాఫీ వల్ల ప్రయోజానాలున్నాయా లేదా నష్టాలున్నాయా అనేది పరిశీలిద్దాం. 
 

1 /6

రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకుండా ఉంటే ఆరోగ్యానికి, శరీరానికి మంచిది.

2 /6

కాఫీలో మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గించే యాంటీ మైగ్రేన్‌ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. లేకుంటే ప్రయోజనం ఉండదు. 

3 /6

హైబీపీ పేషెంట్లకు కాఫీ అంత మంచిది కాదు. కాఫీలో ఉండే కెఫిన్‌ అనే ఉత్ప్రేరక పదార్థంగా పనిచేస్తుంది. దీనివల్ల కాఫీ తాగగానే... దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్‌ లెవెల్ పెరుగుతుంది. 

4 /6

కాఫీలో చాలా మంచి గుణాలున్నాయి. కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని నివారిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.  కాఫీలోని డైఫినాల్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఇందుకు ఉపయోగపడుతుంది. కాఫీ బాడీని ఉత్తేజంగా ఉంచుతుంది.  అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే రోజుకు 2-3 కప్పుల కాఫీ మాత్రమే సేవించాలి

5 /6

ఒక కప్పు కాఫీలో వందల కొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్‌ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే మనిషి శరీరంలో కాస్తైనా తేడా కనిపిస్తుంది. అయితే ఇది మనుషులను బట్టి మారుతుంది.

6 /6

2015 నుంచి ఇంటర్నేషనల్‌ కాఫీ ఆర్గనైజేషన్‌..అంతర్జాతీయ కాఫీ దినోత్సవం కాఫీ డే నిర్వహిస్తూ వస్తోంది. కొన్నిదేశాల్లో ఇది వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నప్పటికీ.. ఎక్కువ దేశాలు మాత్రం అక్టోబర్‌ 1నే జరుపుతున్నాయి. అందుకే అక్టోబర్‌ 1 అంటే అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా ఉంది.